ఆరోగ్యాంధ్రప్రదేశ్‌కు ఆరు సూత్రాలు.. సీఎం జగన్ పిలుపు

ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. కంటివెలుగు, ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో అభివృద్ధి కార్యక్రమాలు, మాతా శిశుమరణాల నివారణ, రోగులకు ఇచ్చే పెన్షన్ సహా పలు అంశాలపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆరోగ్యాంధ్రప్రదేశ్‌కు ఆరు సూత్రాలతో ముందుకు సాగాలని పిలపునిచ్చారు. శుక్రవారం ఏపీ సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో ఆయన పలు విషయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీ, ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాల ప్రకారం మందుల తయారీ, […]

ఆరోగ్యాంధ్రప్రదేశ్‌కు ఆరు సూత్రాలు.. సీఎం జగన్ పిలుపు
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2019 | 4:25 PM

ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. కంటివెలుగు, ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో అభివృద్ధి కార్యక్రమాలు, మాతా శిశుమరణాల నివారణ, రోగులకు ఇచ్చే పెన్షన్ సహా పలు అంశాలపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆరోగ్యాంధ్రప్రదేశ్‌కు ఆరు సూత్రాలతో ముందుకు సాగాలని పిలపునిచ్చారు. శుక్రవారం ఏపీ సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో ఆయన పలు విషయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీ, ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాల ప్రకారం మందుల తయారీ, హాస్పిటల్స్‌లో తగిన మందులను ఉంచడంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్రంలో ప్రతి పౌరుని ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్నందున ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా 108, 104 వాహనాలు కొనుగోలుపై కూడా ఆయన చర్చించారు. నవంబర్‌ 1 నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుల్లోని 150 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీ సేవలు అందించాలని ఆదేశించారు. డిసెంబర్‌ 1నుంచి శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం భావిస్తున్నందున ఆ దిశగా పెండింగ్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. దీనిద్వారా ఆపరేషన్ చేయించుకున్న రోగికి నెలకు రూ.5వేలు లేదా రోజుకు రూ.225 ఇవ్వాలని నిర్ణయించింది. అదే విధంగా తీవ్రమైన కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికే కాకుండా తలసేమియా, హీమోఫీలియా, సికిల్‌సెల్‌ ఎనీమియా వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా రూ.10వేలు ఆర్దిక సాయాన్ని చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. తీవ్ర పక్షవాతంతో వీల్‌ఛైర్‌కు పరిమితమైనవారికీ, రెండు కాళ్లు లేక చేతులు లేనివారు, లేక పనిచేయని స్థితిలో ఉన్నవారికీ, కండరాల క్షీణతతో పనిచేయని పరిస్థితిలో ఉన్నవారికి రూ.5వేల పెన్షన్‌ వర్తించేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇది జనవరి 1 నుంచి ఇది అమలయ్యేలా చూడాలన్నారు.

వీటన్నిటితో పాటు సాధారణంగా ప్రజలను ఇబ్బందిపెడతున్న డెంగూ, సీజనల్‌ వ్యాధులను ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టులో స్ధానం కల్పించాలని సీఎం పేర్కొన్నారు. ఇది కూడా జనవరి 1 నుంచి అమలు జరగాలని ఆదేశించారు. డిసెంబర్‌ 21న ఆరోగ్యకార్డుల జారీ చేయాలని, ఆస్పత్రుల్లో పనిచేసే శానిటేషన్‌ వర్కర్లకు రూ.రూ.16వేలు పెంచేలా వెంటనే జీవో జారీచేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డవారు ఆస్పత్రికి వస్తే… డబ్బుకోసం వేచిచూడాల్సిన అవసరంలేదనే రీతిలో తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు తెలిపారు. దీనికోసం ప్రభుత్వం నుంచే కొంతమొత్తాన్ని కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం విధివిధానాలు ఖరారుచేయాలన్నారు. ఇక వైద్యఆరోగ్యశాఖలో ఖాళీలభర్తీ ప్రక్రియ జనవరిలో మొదలుపెట్టాలన్న సీఎం.