కోడెల మృతిపై స్పందించిన సీఎం జగన్‌

|

Sep 16, 2019 | 3:23 PM

శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మృతికి సీఎం జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోడెల 1983 నుంచి సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నారని..ప్రముఖ వైద్యుడిగా ప్రజలకు సేవలందించారని జగన్‌ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం ఆకాంక్షించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో కోడెల బలవన్మరణానికి పాల్పడ్డారు. Chief Minister Sri YS Jagan Mohan Reddy expressed grief over the death of […]

కోడెల మృతిపై స్పందించిన సీఎం జగన్‌
Chief Minister Sri YS Jagan Mohan Reddy expressed grief over the death of former Andhra Pradesh Assembly Speaker Sri Kodela Siva Prasada Rao
Follow us on

శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మృతికి సీఎం జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోడెల 1983 నుంచి సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నారని..ప్రముఖ వైద్యుడిగా ప్రజలకు సేవలందించారని జగన్‌ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం ఆకాంక్షించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో కోడెల బలవన్మరణానికి పాల్పడ్డారు.

కేసీఆర్‌ సంతాపం..

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోడెల మృతిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విచారం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఓ ప్రకటనలో తెలిపారు. కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని ప్రకటించారు.