కోవిడ్ మరణాలు తగ్గించేందుకు.. జగన్ సర్కార్ సంచలనం..

కరోనా నివారణ చర్యలలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెరుగుతోన్న కోవిడ్ మరణాలపై ప్రత్యేక దృష్టి సారించింది.

కోవిడ్ మరణాలు తగ్గించేందుకు.. జగన్ సర్కార్ సంచలనం..

Updated on: Jul 25, 2020 | 3:18 PM

Remedsivir Tablets For Corona Highly Infected Patients: కరోనా నివారణ చర్యలలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెరుగుతోన్న కోవిడ్ మరణాలపై ప్రత్యేక దృష్టి సారించింది. వాటిని తగ్గించేందుకు రెమ్‌డెసివిర్, టోసీలిజుమబ్‌ లాంటి యాంటీ వైరల్‌ డ్రగ్‌లను పెద్ద మొత్తంలో ఆసుపత్రుల్లో అందుబాటులో తీసుకురావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

దీనితో తొలిదశలో హెటిరో కంపెనీ నుంచి దాదాపు 20 వేల డోసుల రెమ్‌డెసివిర్‌ మందును ఆర్డర్ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న ఆసుపత్రులకు 5 వేల డోసులు చేరుకోగా.. మరో 15 వేల డోసులు ఇవాళ చేరుకోనున్నాయి. అటు ఆగష్టు చివరి వారానికి ఇంకో 70 వేలకు పైగా డోసులను సిద్దంగా ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విషమ పరిస్థితుల్లో ఉన్న 15 వేల మందికి ఈ మందులు సరిపోతాయని వైద్యులు అంచనా వేశారు. కాగా, కరోనా రోగులకు మెరుగైన చికిత్స, సౌకర్యాలు అందించడంలో ఎక్కడా రాజీపడకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు.

Also Read:

ఏపీ: ఇంటర్ విద్యలో మార్పులు.. అభిప్రాయాల సేకరణ..

 ‘పేరు’ కోసమే సుశాంత్ ప్రయత్నించాడు..అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు..

‘దిల్ బేచారా’ మూవీ రివ్యూ… కంటతడి పెట్టిన సుశాంత్ యాక్టింగ్..