తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం వైసీపీలో కుమ్ములాటలు చోటుచేసుకున్నాయి. తోట త్రిమూర్తులు వర్గం వైసీపీలో చేరింది. వైసీపీ బహిరంగ సభకు వెళ్తున్న వైవి సుబ్బారెడ్డి కాన్వాయ్ ను ఆగంతకులు అడ్డుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు తోట త్రిమూర్తులు ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. కొంత కాలంగా ఇజ్రాయిల్, తోట వర్గీయుల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయి. రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వర్గానికి చెందిన మేడిశెట్టి ఇజ్రాయిల్ అనుచరులే సుబ్బారెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారని తెలుస్తోంది.