ఏపీలోని ఆ ప్రాంతంలో వారం రోజుల లాక్‌డౌన్..

చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఎమ్మెల్యే నవాజ్ భాష, డీఎస్పీ రవిమనోహరాచారి ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తుండటంతో నేడు నగరంలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నామని..

ఏపీలోని ఆ ప్రాంతంలో వారం రోజుల లాక్‌డౌన్..

Updated on: Jul 26, 2020 | 11:55 AM

Madanapalli Lockdown: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారిని కట్టడి చేసే క్రమంలో ఇప్పటికే పలు నగరాలు స్వచ్చందంగా లాక్‌డౌన్ పాటిస్తున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఎమ్మెల్యే నవాజ్ భాష, డీఎస్పీ రవిమనోహరాచారి ప్రకటించారు.

కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తుండటంతో నేడు నగరంలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నామని.. అలాగే రేపటి నుంచి ఉదయం 6-11 వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తామని పేర్కొన్నారు. ఆగష్టు 2వ తేదీ వరకు ఈ లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉంటాయన్న ఎమ్మెల్యే నవాజ్ భాష.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Also Read:

కోవిడ్ మరణాలు తగ్గించేందుకు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

బియ్యం కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా కోసం ప్రత్యేక యాప్..!

కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలోనే పేదలకు సులభంగా లోన్స్..