తెలుగు ప్రజలకు చిరంజీవి, విజయశాంతి సంక్రాంతి శుభాకాంక్షలు, అందరి ఇంట కలలపంట పండించాలని ఆకాంక్ష

|

Jan 14, 2021 | 1:24 PM

తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ నటులు.. తర్వాత రాజకీయాల్లో అడుగిడి తామేంటో..

తెలుగు ప్రజలకు చిరంజీవి, విజయశాంతి సంక్రాంతి శుభాకాంక్షలు, అందరి ఇంట కలలపంట పండించాలని ఆకాంక్ష
Follow us on

తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ నటులు.. తర్వాత రాజకీయాల్లో అడుగిడి తామేంటో నిరూపించుకున్న చిరంజీవి, విజయశాంతి. ‘అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగ భాగ్యాల ఈ సంక్రాంతి అందరి ఇంట కలల పంట పండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ సినీనటుడు చిరంజీవి ట్వీట్ చేయగా, ‘భోగ భాగ్యాల‌నిచ్చే భోగి, స‌ర‌దానిచ్చే సంక్రాంతి, క‌మ్మని క‌నుమ‌, కొత్త ఏడాది కొత్త వెలుగులు నింపాల‌ని కోరుకుంటూ ప్రజ‌లంద‌రికీ సంక్రాంతి శుభాకాంక్షలు’ అని విజ‌య‌శాంతి ఆంకాంక్షించారు.