చైనా నిఘా నౌక‌ను తరిమిన భారత్ నేవీ

|

Sep 17, 2020 | 5:42 PM

హిందూ మ‌హాస‌ముద్ర ప్రాంతంలోకి చైనాకు చెందిన యువాన్ వాంగ్ నౌక ప్ర‌వేశించింది. గ‌త నెల‌లో మ‌లాకా సంధిలో ఆ నౌక ప్ర‌వేశించిన‌ట్లు భార‌తీయ నావికాద‌ళం తెలిపింది.

చైనా నిఘా నౌక‌ను తరిమిన భారత్ నేవీ
Follow us on

కల్లబొల్లి మాటలతో డ్రాగన్ కంట్రీ కవ్వింపులకు పాల్పడుతుంది. జిత్తుల మారి చైనా ఎత్తులను భారత్ ఎప్పటికప్పడు తిప్పుకొడుతూనే ఉంది. ఏదో విధంగా హిందూ మహాసముద్రంపై అధిపత్యాన్ని ప్రదర్శించాలనుకుంటున్న డ్రాగన్ కుటిలనీతికి భారత్ అడ్డు తగులుతుంది. తాజాగా హిందూ మ‌హాస‌ముద్ర ప్రాంతంలోకి చైనాకు చెందిన యువాన్ వాంగ్ నౌక ప్ర‌వేశించింది. గ‌త నెల‌లో మ‌లాకా సంధిలో ఆ నౌక ప్ర‌వేశించిన‌ట్లు భార‌తీయ నావికాద‌ళం తెలిపింది. అయితే, చైనా కుట్రను ముందుగానే పసిగట్టిన భార‌తీయ నౌకాద‌ళానికి చెందిన‌ యుద్ధ‌నౌక‌లు.. చైనా నౌక‌ను వెంబ‌డించాయి. హిందూ స‌ముద్ర ప్రాంతంలో ఉన్న నేవీ షిప్స్‌.. చైనా నౌక‌ను నిరంతరం ట్రాక్ చేసిన‌ట్లు అధికారులు తెలిపారు.

భార‌తీయ నేవీకి చెందిన‌ యుద్ధ నౌక‌లు నిరంత‌రం నిఘా పెట్ట‌డం వ‌ల్ల కొన్ని రోజుల క్రిత‌మే చైనా నౌక తిరుగు ప్ర‌యాణ‌మైన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, ప‌రిశోధ‌న క్లాస్‌కు చెందిన చైనా నౌక యువాన్ వాంగ్ రాక ప‌ట్ల అధికారులు స‌మీక్ష చేప‌డుతున్నారు. నౌక రాక వెనుక దాగి ఉన్న కుట్రను ఆరా తీస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చైనీస్ రీస‌ర్చ్ వెస‌ల్ హిందూ మ‌హాస‌ముద్రంలోకి రావ‌డం ఇదేమీ తొలిసారి కాదు అని, కానీ నిరంతంగా ఆ నౌక‌పై నిఘా పెట్టిన‌ట్లు అధికారులు చెప్పారు. భారత తీరంలోని హిందూ మహాసముద్రంపై నిఘా మరింత పటిష్ట పరిచినట్లు నౌక దళం అధికారులు పేర్కొన్నారు.