జియోనీ కంపెనీ భారీ మోసం, యూజర్స్‌కు తెలియకుండా 20 మిలియన్లకు పైగా ఫోన్లలోకి హానికర మాల్‌వేర్

చైనాకు చెందిన దిగ్గజ మొబైల్ కంపెనీ జియోనీ.. ట్రోజన్ హార్స్ అనే వైరస్‌ను ఉద్దేశపూర్వకంగా  20 మిలియన్లకు పైగా ఫోన్లలోకి ప్రవేశపెట్టినట్లు  ఆ దేశంలోని ఓ కోర్టు గుర్తించింది.

జియోనీ కంపెనీ భారీ మోసం, యూజర్స్‌కు తెలియకుండా 20 మిలియన్లకు పైగా ఫోన్లలోకి హానికర మాల్‌వేర్

Updated on: Dec 06, 2020 | 1:19 PM

చైనాకు చెందిన దిగ్గజ మొబైల్ కంపెనీ జియోనీ.. ట్రోజన్ హార్స్ అనే వైరస్‌ను ఉద్దేశపూర్వకంగా  20 మిలియన్లకు పైగా ఫోన్లలోకి ప్రవేశపెట్టినట్లు  ఆ దేశంలోని ఓ కోర్టు గుర్తించింది. వినియోగదారులకు తెలియకుండా వారి ఫోన్లలో అనుచిత ప్రకటనలతో పాటు ఇతర హానికరమైన కార్యకలాపాల జరిగేలా వైరస్‌ను ఇన్‌బిల్డ్ చేశారట. ఈ స్కామ్ కోసం‌ కంపెనీ కోట్లలో ముడుపులు అందుకున్నట్లు  తేలింది. 

జియోనీకి అనుబంధ సంస్థ అయిన షెన్‌జెన్ జిపు టెక్నాలజీ కో. లిమిటెడ్ “స్టోరీ లాక్ స్క్రీన్” యాప్ ఉపయోగించి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పేరుతో  ట్రోజన్ హార్స్‌ను అమర్చారు. 2018 లో మొదటిసారిగా వారు ఈ వైరస్‌ను ఫోన్లలో ఇన్‌స్టాల్ చేయడం ప్రారంభించారు.  2019 అక్టోబర్ వరకు ఇదే తంతు కొనసాగించారు. ఈ పద్దతిలో 21.75 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రభావితం చేయడం ద్వారా..కంపెనీ సుమారు 4.2 మిలియన్ డాలర్లు అర్జించినట్లు తేలింది. మొబైల్ పరికరాలను చట్టవిరుద్ధంగా నియంత్రించినందుకు న్యాయస్థానం.. గ్జూ లి, జో యింగ్, జియా జెంగ్కియాంగ్, పాన్ క్వి లను దోషులుగా తేల్చింది. వారికి 3 నుంచి 3.5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 22,59,738 రూపాయల ఫైన్ వేసింది. విష్మయం కలిగించే విషయం ఏంటంటే చౌకైన ఫోన్లను ఉత్పత్పి చేసే  చాలా చైనీస్ స్మార్ట్‌ఫోన్‌లు కంపెనీలు కూడా ఇదే హానికరమైన చర్యకు పాల్పడినట్లు తేలింది. ఇన్ఫినిక్స్, టెక్నో వంటి కంపెనీలు ఆ లిస్ట్‌లో ఉన్నాయి. 

Also Read :

రిటర్నింగ్ ఆఫీసర్ టీఆర్‌ఎస్ కొమ్ముకాసారు.. నేరెడ్‌మెట్ బీజేపీ అభ్యర్థి ప్రసన్న సంచలన ఆరోపణలు

అతిలోకసుందరి కూతురుకు క్రేజీ ఆఫర్స్ ఎందుకు రావడం లేదు, బాలీవుడ్ మేకర్స్ ప్రాబ్లం ఏంటి..?

యాంకర్ భామల ఫోటో షూట్లు : శీతాకాలంలో సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నారు…