సౌత్ చైనా సీ దిశగా అమెరికా విమానాలు..పేల్చేస్తామన్న చైనా

సౌత్ చైనా సీ (చైనాకు దక్షిణ దిశగా ఉన్న సముద్ర ప్రాంతం) దిశగా రెండు అమెరికన్ విమానాలను తాము చూశామని, వాటిని విమాన విధ్వంసక క్షిపణులతో పేల్చివేస్తామని చైనా హెచ్ఛరించింది. ' మా వద్ద డీఎఫ్-21 డీ, డీ-ఎఫ్-26 వంటి..

సౌత్ చైనా సీ దిశగా అమెరికా విమానాలు..పేల్చేస్తామన్న చైనా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 06, 2020 | 7:45 PM

సౌత్ చైనా సీ (చైనాకు దక్షిణ దిశగా ఉన్న సముద్ర ప్రాంతం) దిశగా రెండు అమెరికన్ విమానాలను తాము చూశామని, వాటిని విమాన విధ్వంసక క్షిపణులతో పేల్చివేస్తామని చైనా హెచ్ఛరించింది. ‘ మా వద్ద డీఎఫ్-21 డీ, డీ-ఎఫ్-26 వంటి కిల్లర్ మిసైల్స్ ఉన్నాయి. వాటితో మీ విమానాలను కూల్చివేస్తాం’ అని చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక పేర్కొంది. వివాదాస్పద ఈ సముద్ర ప్రాంతంపై ఇటీవల రెండు అమెరికన్ విమానాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఏ క్షణంలో నైనా వాటిని నాశనం చేస్తామని, ఈ ప్రాంతమంతా తమ ఆధీనంలోనే ఉందని డ్రాగన్ కంట్రీ  స్పష్టం చేసింది. ఇది పూర్తిగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధీనంలో ఉంది. ఇక్కడ ఏ విదేశీ విమానం కనిపించినా ఆ సైన్యం అత్యుత్సాహంగా దాన్ని కూల్చివేస్తుంది అని ట్వీట్ చేసింది. కాగా.. చైనా విమానాలే ఈ ప్రాంతంలో విన్యాసాలు చేసాయని అమెరికా ఆరోపించింది. తమవి యుధ్ధ విమానాలు కావని వెల్లడించింది. అమెరికా-చైనా మధ్య రోజురోజుకీ సంబంధాలు క్షీణిస్తున్నాయి. కరోనా వైరస్ ఆవిర్భావానికి చైనాయే కారణమని అమెరికా ఆరోపించినప్పటి నుంచీ.. అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వంపై చైనా విరుచుకుపడుతోంది.

Video Courtesy: Daily Mail UK