చైనా మరో కీలక నిర్ణయం.. న్యూజీలాండ్ తో ఒప్పందం రద్దు

|

Aug 04, 2020 | 12:08 AM

కరోనా మహమ్మారిని ప్రపంచానికి అంటగట్ఠిన చైనా అన్ని దేశాలతో సత్సంబంధాలకు దూరమవుతోంది. మరోవైపు డ్రాగన్ కంట్రీ వివిధ దేశాలపై ప్రతీకార చర్యలకు తెగబడుతోంది. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో చైనా అనేక ఒప్పందాలను రద్దు చేసుకున్న మరో దేశాన్ని కూడా తెగతెంపులు చేసుకుంటోంది.

చైనా మరో కీలక నిర్ణయం.. న్యూజీలాండ్ తో ఒప్పందం రద్దు
Follow us on

కరోనా మహమ్మారిని ప్రపంచానికి అంటగట్ఠిన చైనా అన్ని దేశాలతో సత్సంబంధాలకు దూరమవుతోంది. మరోవైపు డ్రాగన్ కంట్రీ వివిధ దేశాలపై ప్రతీకార చర్యలకు తెగబడుతోంది. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో చైనా అనేక ఒప్పందాలను రద్దు చేసుకున్న మరో దేశాన్ని కూడా తెగతెంపులు చేసుకుంటోంది. తాజాగా న్యూజీలాండ్ తో కూడా ఓ కీలక ఒప్పందాన్ని రద్దు చేసుకుంది చైనా. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ వెల్లడించారు. ‘నేరస్థులను, దేశం నుంచి పారిపోయి వచ్చినవారిని తిరిగి అప్పగించడానికి సంబంధించి ఇరు దేశాల మధ్య ఇన్నాళ్లుగా ఉన్న ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేసుకుంటున్నట్లు వాంగ్ బిన్ ప్రకటించారు. హాంకాంగ్ లో చైనా కొత్త రక్షణ చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో ఈమేరుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇదివరకే హాంకాంగ్ తో న్యూజీలాండ్ ఇదే ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో చైనా కూడా ఈ నిర్ణయం తీసుకుందని వాంగ్ తెలిపారు.