
China prepares COVID-19 vaccines: కరోనా సెకెండ్ వేవ్ మొదలైంది. థర్డ్ వేవ్ కూడా ఉండనుంది. దీంతో ఇప్పటికే కొన్ని దేశాల్లో మళ్లీ లాక్ డౌన్ ప్రకటించారు. అయితే కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో చైనా కాస్త ముందుంది. ఎక్కువగా డోసులు తయారీ చేస్తూ ఆ దేశం దూసుకెళ్తోంది. 2021 చివరి నాటికి దాదాపు 60కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను తయారు చేసేందుకు సిద్దమవుతోంది. చైనాలో ఇప్పటికే ఐదు వ్యాక్సిన్‌లు అభివృద్ధి దశలో ఉన్నాయి. వీటికి సంబంధించిన తుదిదశ ప్రయోగాలు దాదాపు పన్నెండు దేశాల్లో జరుగుతున్నాయి.
సినోవాక్ సంస్థ రూపొందించిన వ్యాక్సిన్ తుదిదశ ప్రయోగాలు బ్రెజిల్, టర్కీ, ఇండోనేషియాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ను చైనా ఆరోగ్య సిబ్బందికి, సైనిక అధికారులకు అందజేశాశారు. చైనాలో ఈ వ్యాక్సిన్ ను భారీగా పంపిణీ చేస్తున్నారు. కానీ దీనికి అధికారిక అనుమతులు లేవు. సినోవాక్ తయారు చేసిన వ్యాక్సిన్ రెండు డోసుల్లో తీసుకోవాలి. దీన్ని 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్దే నిల్వ చేయాలి.
ఇక ప్రపంచానికి మొత్తం తమ వ్యాక్సిన్ సరఫరా చేయాలని చూస్తోందట చైనా. కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి ప్రపంచానికి తోడ్పడతామంటోంది. అంతేకాదు కరోనా నేపథ్యంలో పేద దేశాలకు చైనా నిధులిచ్చేందుకు వీలుగా నిబంధనలను సవరిస్తున్నామని ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్
ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.