టిక్ టాక్ బ్యాన్.. పర్యవసానం.?

|

Aug 27, 2020 | 8:30 PM

చైనా దుందుడుకు చర్యలతో టిక్ టాక్ సహా పలు చైనా యాప్ లను భారత్ బ్యాన్ చేయగా దాని పర్యావసానాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాలన్న విషయంలో..

టిక్ టాక్ బ్యాన్.. పర్యవసానం.?
Follow us on

చైనా దుందుడుకు చర్యలతో టిక్ టాక్ సహా పలు చైనా యాప్ లను భారత్ బ్యాన్ చేయగా దాని పర్యావసానాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాలన్న విషయంలో చైనా దిగ్గజ సంస్థ అలీబాబా గ్రూప్‌ పునరాలోచన చేస్తున్నట్టు సమాచారం. భారత్ – చైనా సరిహద్దు వివాదాల నేపథ్యంలో వెనక్కి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని రాయిటర్స్ సంస్థ వెల్లడించింది. కాగా, ఇండియాలో స్టార్టప్‌ పరిశ్రమలను స్థాపించాలని అలీబాబా కంపెనీ భావించిన సంగతి తెలిసిందే. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ విషయమై ఆరు నెలల వరకు వేచిచూడాలని అలీబాబా ఆలోచిస్తోందట. గతంలో అలీబాబా సంస్థకు అనుబంధంగా ఉన్న సంస్థలు 2 బిలియన్‌ డాలర్లు ఇండియాలో పెట్టుబడులు పెట్టాయి. అలీబాబాకు పేటీఎమ్‌, జొమాటో, బిగ్‌బాస్కెట్‌ వంటి సంస్థల్లో ఇప్పటికే పెట్టుబడులు ఉన్నాయి.