మీ దళాలను ఉపసంహరించండి, చైనా డిమాండ్

లడాఖ్ సరిహద్దుల్లో ఆక్రమణలకు దిగడమే కాకుండా చైనా-ఇండియాపై ఎదురుదాడికి దిగింది. మీ సైన్యాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. తమ సరిహద్దుల్లో..

మీ దళాలను ఉపసంహరించండి, చైనా డిమాండ్

Edited By:

Updated on: Aug 31, 2020 | 7:54 PM

లడాఖ్ సరిహద్దుల్లో ఆక్రమణలకు దిగడమే కాకుండా చైనా-ఇండియాపై ఎదురుదాడికి దిగింది. మీ సైన్యాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. తమ సరిహద్దుల్లో భారత సైనికులు అక్రమంగా చొచ్ఛుకుని వచ్చారని ఆరోపించింది. దీనిని ఎదుర్కొనేందుకు తాము చర్యలు తీసుకుంటామని, తమ ప్రాదేశిక సమగ్రతను కాపాడుకుంటామని చైనా సైనిక ప్రతినిధి ఒకరు అన్నారు. మరోవైపు లడాఖ్ నియంత్రణ రేఖ వద్ద చైనా దళాలు ముందుకు వచ్చాయని, యధాతథ పరిస్థితిని మార్చడానికి యత్నించాయని భారత ఆర్మీ ఆరోపిస్తోంది. చైనా సైనికులు పెద్ద సంఖ్యలో పాంగాంగ్ సో సరస్సు వద్ద మోహరించి ఉన్నారని పేర్కొంది. అక్కడి భూభాగాన్ని ఏకపక్షంగా ఆక్రమించుకునే యత్నంలో భాగమే ఇదని తెలిపింది. ఏమైనా, సరిహద్దుల్లో మళ్ళీ ఉద్రిక్తతలు తలెత్తాయి.