భారత తయారీ వ్యాక్సిన్‌పై డ్రాగన్ కంట్రీ ప్రశంసలు.. భారత సామర్థ్యాన్ని అయిష్టంగానే అంగీకరించిన చైనా

|

Jan 10, 2021 | 9:52 PM

చైనా అయిష్టంగానే మన సామర్థ్యానికి ఓకే చెప్పింది. ఈ మేరకు ఆ దేశ అధికార పత్రిక ‘గ్లోబల్‌ టైమ్స్‌’లో కథనం ప్రచూరించింది. పరిశోధన, ఉత్పాదన సామర్థ్యం పరంగా చైనా తయారు..

భారత తయారీ వ్యాక్సిన్‌పై డ్రాగన్ కంట్రీ ప్రశంసలు.. భారత సామర్థ్యాన్ని అయిష్టంగానే అంగీకరించిన చైనా
Follow us on

India’s Vaccines Good : భారత్‌లో తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌పై ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే భాటలో డ్రాగన్ కంట్రీ చైనా చేరింది. కొవిడ్‌-19 టీకాలకు విదేశాల్లో మంచి డిమాండ్‌ నెలకొంది. ఈ నేపథ్యంలో.. చైనా అయిష్టంగానే మన సామర్థ్యానికి ఓకే చెప్పింది. ఈ మేరకు ఆ దేశ అధికార పత్రిక ‘గ్లోబల్‌ టైమ్స్‌’లో కథనం ప్రచూరించింది. పరిశోధన, ఉత్పాదన సామర్థ్యం పరంగా చైనా తయారు చేసిన కరోనా టీకాలకు భారత వ్యాక్సిన్లు ఏ మాత్రం తీసిపోవని ప్రకటించింది. టీకాల తయారీలో భారత్‌కు ప్రపంచంలోనే అత్యధిక ఉత్పాదన సామర్థ్యం ఉందని రాసుకొచ్చింది. అలాగే కార్మిక, ఇతర సౌకర్యాల ఖర్చులు కూడా అక్కడ తక్కువ చాలా తక్కువ అంటూ పేర్కొంది. ఈ కారణంగా.. టీకా ఎగుమతి చేయాలన్న భారత ప్రణాళిక అంతర్జాతీయ మార్కెట్‌కు సానుకూల పరిణామం అవుతుందని తన అధికార పత్రికలో తెలిపింది.

అయితే దీని వెనుక భారత్‌కు రాజకీయ, ఆర్థిక ఉద్దేశాలు ఉండొచ్చని చైనా ఆరోపించింది. తన రాజకీయ బ్రాండ్‌ను మెరుగుపరచుకోవడానికి, అంతర్జాతీయంగా చైనా టీకాల ప్రాబల్యాన్ని తగ్గించడానికి భారత్‌ స్వదేశీ టీకాలను ఉపయోగించొచ్చని కూడా అనుమానాలు వ్యక్తంచేసింది. హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ సంస్థను సందర్శించిన జిలిన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌ నిపుణుడు జియాంగ్‌ చున్లాయ్‌ చేసిన వ్యాఖ్యలను కూడా తన ప్రకటనలో పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో వంటి సంస్థలతో భారత టీకా సంస్థలు మొదటే చేతులు కలిపాయని కూడా ఆయన తెలిపినట్లు వివరించింది.