డైనోసార్లు అంత చిన్నగా కూడా ఉండేవా..? తాజాగా జరిగిన పరిశోధనలో బయటపడ్డ ఆసక్తికర విషయాలు.

| Edited By: Pardhasaradhi Peri

Dec 21, 2020 | 7:43 PM

డైన్‌సార్‌ను ఇప్పటి వరకు ఎవరూ నేరుగా చూసి ఉండకపోయినా ఆ పేరు వినగానే అందరికీ ఓ భారీ ఆకారం మనసులోకి వస్తుంది. . అయితే కొడి పిల్లంత పరిమాణంలో ఉండే డైనోసార్లు కూడా ఉండేవనే విషయం మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం...

డైనోసార్లు అంత చిన్నగా కూడా ఉండేవా..? తాజాగా జరిగిన పరిశోధనలో బయటపడ్డ ఆసక్తికర విషయాలు.
Follow us on

chicken sized dinosaur: డైన్‌సార్‌ను ఇప్పటి వరకు ఎవరూ నేరుగా చూసి ఉండకపోయినా ఆ పేరు వినగానే అందరికీ ఓ భారీ ఆకారం మనసులోకి వస్తుంది. డైనోసార్లు అత్యంత భయంకరంగా, తాటి చెట్టంత పొడువుగా ఉంటాయని మనందరికీ తెలుసు. ఇప్పటి వరకు బయట పడ్డ డైనోసార్ శిలాజాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. అయితే కొడి పిల్లంత పరిమాణంలో ఉండే డైనోసార్లు కూడా ఉండేవనే విషయం మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
తాజాగా చైనాకు చెందిన శాస్ర్తవేత్తల పరిశోధనల్లో ఈ ఆసక్తికరమైన విషయం బయటపడింది. చైనాలో దొరికిన 120 మిలియన్ ఏళ్ల నాటి డైనోసార్ శిలాజం ఆధారంగా పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. శాస్ర్తవేత్తలు ఈ శిలాజాన్ని విశ్లేషించిన అనంతరం ఈ డైనోసార్ జాతిని ‘వులాంగ్ బోహైయెన్సిస్’ లేదా ‘డ్యాన్సింగ్ డ్రాగన్’గా నామకరణం చేశారు. ఈ డైనోసార్ ఒకపొడవైన తోకతో ఒక చిన్న పక్షి (కోడి) పరిమాణంలో ఉందని తెలిపారు. అంతేకాకుండా ఈ డైనోసార్ ఊహా చిత్రాన్ని కూడా శాస్ర్తవేత్తలు విడుదల చేశారు.