ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ రెండు జిల్లాల్లో బ్యాంకుల వేళల్లో మార్పులు

|

Jul 29, 2020 | 2:33 PM

ఏపీ ప్రజలకు అలెర్ట్.. రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో బ్యాంకుల పని వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనా వైరస్ బారిన పెద్ద సంఖ్యలో బ్యాంక్ ఉద్యోగులు పడుతున్న నేపధ్యంలో ఆ జిల్లాల కలెక్టర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ రెండు జిల్లాల్లో బ్యాంకుల వేళల్లో మార్పులు
Follow us on

Change In Banks Timings In Andhra Pradesh: ఏపీ ప్రజలకు అలెర్ట్.. రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో బ్యాంకుల పని వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనా వైరస్ బారిన పెద్ద సంఖ్యలో బ్యాంక్ ఉద్యోగులు పడుతున్న నేపధ్యంలో ఆ జిల్లాల కలెక్టర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అటు పాజిటివ్ కేసులు కూడా విపరీతంగా పెరుగుతుండటంతో పలు జిల్లాల్లో లాక్ డౌన్ ఆంక్షలు అమల్లోకి వచ్చిన సంగతి విదితమే.

దీనితో వాటికీ తగ్గట్టుగా జిల్లాల వారీగా బ్యాంకు పనివేళలలో మార్పులు చేశారు. కృష్ణా జిల్లాలో ఈ నెల 28 నుంచి ఆగష్టు 31 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే బ్యాంకులు ఓపెన్ చేసి ఉంటాయని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ప్రకాశం జిల్లాలో కూడా మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి.

Also Read:

అరగంటలో పేషెంట్ అడ్మిట్ కావాలి.. సీఎం జగన్ సీరియస్ వార్నింగ్..

కోవిడ్ మరణాలు తగ్గించేందుకు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా కోసం ప్రత్యేక యాప్..!