సినీగేయ రచయిత చంద్రబోస్‌కు మాతృవియోగం

అర్థవంతమైన పాటలతో తెలుగు సినీ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి మదనమ్మ  సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. నరసయ్య, మదనమ్మ దంపతులకు నలుగురు సంతానం. వారిలో చంద్రబోస్ చిన్నవాడు. తన తల్లి ప్రోత్సాహం, ప్రేమాభిమానాల వల్లే నేనీ స్థాయిలో ఉన్నానని చంద్రబోస్ చాలా సందర్భాల్లో చెప్పేవాడు. వరంగల్ జిల్లా చిట్యాల మండలం చల్లగిరి గ్రామంలో మదనమ్మ అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. చంద్రబోస్ […]

సినీగేయ రచయిత చంద్రబోస్‌కు మాతృవియోగం

Updated on: May 20, 2019 | 3:34 PM

అర్థవంతమైన పాటలతో తెలుగు సినీ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి మదనమ్మ  సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. నరసయ్య, మదనమ్మ దంపతులకు నలుగురు సంతానం. వారిలో చంద్రబోస్ చిన్నవాడు.

తన తల్లి ప్రోత్సాహం, ప్రేమాభిమానాల వల్లే నేనీ స్థాయిలో ఉన్నానని చంద్రబోస్ చాలా సందర్భాల్లో చెప్పేవాడు. వరంగల్ జిల్లా చిట్యాల మండలం చల్లగిరి గ్రామంలో మదనమ్మ అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. చంద్రబోస్ తల్లి మరణ వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు.