“పారాసిటమాల్ వేస్తే కరోనా తగ్గిపోతుందా”..సీఎంపై బాబు ఫైర్

|

Mar 15, 2020 | 6:16 PM

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. ఫస్ట్ టైమ్ ప్రెస్ ‌మీట్ పెట్టిన సీఎం తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని విమర్శించారు. కరోనా వైరస్‌‌ ప్రభావంతో ప్రపంచ దేశాలు గడగడలాడుతుంటే..సీఎం జగన్ బుద్ది లేకుండా మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా భారిన పడినవారి సంఖ్య లక్ష దాటిపోయిందని, భారత్‌లో ఈ వైరస్ విజృంభిస్తే పరిస్థితి ఊహించలేమన్నారు. తెలంగాణ సీఎం కూడా మొదట తెలియక మాట్లాడినా, తర్వాత కరోనా వ్యాప్తి […]

పారాసిటమాల్ వేస్తే కరోనా తగ్గిపోతుందా..సీఎంపై బాబు ఫైర్
Follow us on

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. ఫస్ట్ టైమ్ ప్రెస్ ‌మీట్ పెట్టిన సీఎం తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని విమర్శించారు. కరోనా వైరస్‌‌ ప్రభావంతో ప్రపంచ దేశాలు గడగడలాడుతుంటే..సీఎం జగన్ బుద్ది లేకుండా మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా భారిన పడినవారి సంఖ్య లక్ష దాటిపోయిందని, భారత్‌లో ఈ వైరస్ విజృంభిస్తే పరిస్థితి ఊహించలేమన్నారు. తెలంగాణ సీఎం కూడా మొదట తెలియక మాట్లాడినా, తర్వాత కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. సీఎం జగన్ ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ పబ్బం గడుపుకున్నారు తప్పితే, ప్రజలకు వ్యాధి గురించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి..ఏం చెయ్యాలి..? ఏం చెయ్యకూడదనే వాటి గురించి మాట్లాడకపోవడం అతని అజ్ఞానాన్ని తెలియజెబుతుందన్నారు.

మనుషుల ప్రాణాలకంటే ఎన్నికలు ముఖ్యమా అని సీఎం జగన్‌ను ప్రశ్నించారు చంద్రబాబు. 60ఏళ్లు పైబడిన వారికే కరోనా వస్తుందని సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న చంద్రబాబు,  కరోనా విజృంభణకు సంబంధించిన వివిధ వీడియో క్లిప్పులను ప్లే చేసి చూపించారు. కరోనా వస్తే పారాసిటమాల్‌ వేస్తే తగ్గిపోతుందని చెప్పడం జగన్ చేతగానితనానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రజలను జీవితాలతో ఆడుకునే హక్కు జగన్‌కు లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

.