
తమ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదే అన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. 40 శాతం ఓటర్లు టీడీపీకీ ఓటేశారని అన్నారు. గుంటూరు టీడీపీ ఆఫీస్‌కు వచ్చిన చంద్రబాబు.. స్టేట్ ఆఫీస్ సిద్ధమయ్యే వరకూ ఇక్కడ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తామన్నారు. ప్రజా సమస్యలపై పోరాడతామన్నారు. కాగా.. రేపటి నుంచి రెండు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తానని చంద్రబాబు చెప్పారు.