అంబేద్కర్‌కు చంద్రబాబు, జగన్ నివాళులు

ఢిల్లీ: ఏపీ భవన్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు.  కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, సుజనా చౌదరి, కళా వెంకట్రావు, జూపూడి ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాజ్యాంగం ఉన్నంత వరకు చిరస్థాయిలో నిలిచిపోయే వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగంలో  అనేక సమస్యలకు పరిష్కారాలను పొందుపరిచారని గుర్తు చేశారు. దేశ ప్రజల చేతికి కత్తి ఇవ్వకుండా.. ఓటు హక్కు ఇచ్చానని అంబేద్కర్ చెప్పారని చంద్రబాబు […]

అంబేద్కర్‌కు చంద్రబాబు, జగన్ నివాళులు

Edited By:

Updated on: Apr 14, 2019 | 1:58 PM

ఢిల్లీ: ఏపీ భవన్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు.  కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, సుజనా చౌదరి, కళా వెంకట్రావు, జూపూడి ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాజ్యాంగం ఉన్నంత వరకు చిరస్థాయిలో నిలిచిపోయే వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగంలో  అనేక సమస్యలకు పరిష్కారాలను పొందుపరిచారని గుర్తు చేశారు. దేశ ప్రజల చేతికి కత్తి ఇవ్వకుండా.. ఓటు హక్కు ఇచ్చానని అంబేద్కర్ చెప్పారని చంద్రబాబు అన్నారు.

అమరావతి : ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అంబేద్కర్‌కు నివాళులు అర్పించారు.  వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పార్టీ అధినేత జగన్‌ పూలమాల వేసి అంజలి ఘటించారు. వైఎస్‌ జగన్‌తోపాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు అంబేద్కర్‌కు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.