కరోనా భయం..బ్లాక్ మార్కెట్లో మాస్కులు.. అమ్మితే భరతం పడతాం.. కేంద్రం

| Edited By: Pardhasaradhi Peri

Mar 07, 2020 | 2:54 PM

దేశంలో కరోనాకేసులు వెల్లువెత్తుతుండడంతో ఫేస్ మాస్కులు, చేతి శానిటరీలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. దీంతో బ్లాక్ మార్కెటీర్లు ఇదే అదననుకుని హెచ్చు ధరలకు వీటిని అమ్మడం ప్రారంభించారు. ఆయా రకాలను బట్టి సాధారణ ధరలకు లభించే వీటిని బ్లాక్ లో అమ్ముతున్నట్టు కేంద్రం దృష్టికి తెలిసింది. అయితే ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర కెమికల్స్, ఫార్మాస్యుటికల్స్ శాఖ మంత్రి డీవీ. సదానంద గౌడ హెచ్చరించారు.  ఇండియాలో ఫేస్ మాస్కులు, శానిటరీలకు కొరత లేదని ఇండస్ట్రీ నిపుణులు […]

కరోనా భయం..బ్లాక్ మార్కెట్లో మాస్కులు.. అమ్మితే భరతం పడతాం.. కేంద్రం
Follow us on

దేశంలో కరోనాకేసులు వెల్లువెత్తుతుండడంతో ఫేస్ మాస్కులు, చేతి శానిటరీలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. దీంతో బ్లాక్ మార్కెటీర్లు ఇదే అదననుకుని హెచ్చు ధరలకు వీటిని అమ్మడం ప్రారంభించారు. ఆయా రకాలను బట్టి సాధారణ ధరలకు లభించే వీటిని బ్లాక్ లో అమ్ముతున్నట్టు కేంద్రం దృష్టికి తెలిసింది. అయితే ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర కెమికల్స్, ఫార్మాస్యుటికల్స్ శాఖ మంత్రి డీవీ. సదానంద గౌడ హెచ్చరించారు.  ఇండియాలో ఫేస్ మాస్కులు, శానిటరీలకు కొరత లేదని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారని, పైగా తమ శాఖ వీటి లభ్యతను అంచనా వేస్తోందని ఆయన చెప్పారు. ఈ ఉత్పత్తుల కొరత లేదా పెరిగిన వీటి ధరల గురించి ప్రభుత్వానికి ఎలాంటి వార్తలు అందలేదని, కానీ ముందు జాగ్రత్త చర్యగా బ్లాక్ మార్కెటీర్లు, హోర్దర్లపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా అధికారులను ఆదేశిస్తున్నామని సదానంద గౌడ పేర్కొన్నారు.

కాగా- ఇండియాలో నమోదైన  కరోనా కేసుల సంఖ్య 33 కి పెరిగింది. 29 వేలమందిని వైద్య సంబంధ నిఘాలో ఉంచారు. మాస్కులు, శానిటరీల కోసం ప్రజలు మందుల దుకాణాల వద్ద చేరుతున్నా.. దుకాణ యజమానుల నుంచి ‘నో స్టాక్’ అన్న సమాధానమే వస్తోంది.