బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ వెబ్ సిరీస్ ‘తాండవ్’ వివాదం వేడెక్కుతోంది. దీన్ని ప్రసారం చేస్తున్న అమెజాన్ ప్రైమ్ నుంచి సంజాయిషీ కావాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సమన్లు జారీ చేసింది. కాగా- ఈ సిరీస్ లోని నటులు, దర్శకునిపై బీజేపీ నేత రామ్ కదమ్ నేరుగా సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కి లేఖ రాస్తూ.., హిందూ దేవుళ్లను, దేవతలను కించపరిచేలా ఉన్న సిరీస్ లను ప్రసారం చేయకుండా చూసేందుకు, కంటెంట్ ను సమీక్షించేందుకు సెన్సార్ బోర్డును ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. తాండవ్ మేకర్స్ కావాలనే హిందూ దేవుళ్లను, దేవతలను హేళన చేసేలా ఈ సిరీస్ తీశారన్నారు. తాండవ్ సిరీస్ లో నటించిన సైఫ్ అలీఖాన్, డింపుల్ కపాడియా, జేషన్ అయూబ్ లతో బాటు డైరెక్టర్ అలీ అబ్బాస్ జఫర్ కూడా అపాలజీ చెప్పాలని ఆయన ఇదివరకే డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. లోగడ కూడా ఆదిపురుష్ చిత్రానికి సంబంధించి రావణునిపై చేసిన ఓ వ్యాఖ్యకు సైఫ్ అలీఖాన్ ఆ తరువాత క్షమాపణ చెప్పాడు.
Why is it becoming a trend amongst films and web series makers to demean Hindu gods? Latest culprit seems to be the series #Tandav. #SaifAliKhan again part of a film or series which attempts to target Hindu deities. Director Ali Abbas Zafar needs to remove that scene which mocks pic.twitter.com/AausBUh2ky
— Ram Kadam – राम कदम (@ramkadam) January 17, 2021
Father And Son Die: ప్రాణాలు తీసిన కోడికూర వంట.. విద్యుదాఘాతంతో తండ్రీకొడుకుల మృతి..