‘ జనగణమన ‘ ఆలపిస్తున్న వేళ… హఠాత్తుగా …

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. షోలాపూర్ లోని పుష్యలోక్ అహల్యాదేవి హోల్కరీ యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయినప్పుడు.. జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో కళ్ళు తిరిగి ఆయన ఒక్కసారిగా కుర్చీలో కూచుండిపోయారు. వెంటనే ఆయనకు డాక్టర్లు ప్రాథమిక చికిత్స చేసి.. ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. గొంతు సంబంధ రుగ్మత (థ్రోట్ ఇన్ఫెక్షన్) తో ఆయన బాధ పడుతున్నారు. దీనికి యాంటీ బయోటిక్స్ వాడుతున్నారు. అయితే ఈ మందుల డోస్ ఎక్కువకావడంతో […]

 జనగణమన  ఆలపిస్తున్న వేళ... హఠాత్తుగా ...

Updated on: Aug 01, 2019 | 5:21 PM

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. షోలాపూర్ లోని పుష్యలోక్ అహల్యాదేవి హోల్కరీ యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయినప్పుడు.. జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో కళ్ళు తిరిగి ఆయన ఒక్కసారిగా కుర్చీలో కూచుండిపోయారు. వెంటనే ఆయనకు డాక్టర్లు ప్రాథమిక చికిత్స చేసి.. ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. గొంతు సంబంధ రుగ్మత (థ్రోట్ ఇన్ఫెక్షన్) తో ఆయన బాధ పడుతున్నారు. దీనికి యాంటీ బయోటిక్స్ వాడుతున్నారు. అయితే ఈ మందుల డోస్ ఎక్కువకావడంతో నితిన్ గడ్కరీ ఒక్కసారిగా గిడ్డీ నెస్ కి గురయ్యారు. గతంలో కూడా ఆయన కళ్ళు తిరిగి పడిపోగా వెంటనే చికిత్స లభించి కోలుకున్నారు.