central govt good news to sc students: దేశంలోని ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఎస్సీ విద్యార్థుల చదువుల కోసం ఏకంగా రూ.59 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌ల ద్వారా దాదాపు 4 కోట్లకు పైగా విద్యార్థులకు మేలు జరగనుంది. ఈ మొత్తాన్ని రానున్న ఐదేళ్లలో విద్యార్థుల చదువులు, సంక్షేమం కోసం ఉపయోగించనున్నారు.
కేంద్ర కేబినెట్‌లో తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్ర మంత్రి తవర్‌చంద్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ఎస్సీ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.35,534 కోట్లు ఖర్చు చేయనుండగా మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.