ఫ్లైఓవర్స్‌పై ప్రత్యేక నిఘా..! పోలీసుల కీలక సూచనలు..!

| Edited By:

Nov 17, 2019 | 8:51 AM

నగరంలోని ఫ్లైఓవర్స్‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నారు పోలీసులు. ప్రత్యేకమైన సీసీ కెమెరాలను ప్రతీ.. ఫ్లైఓవర్స్‌పై పెట్టనున్నారు. సెల్ఫీల పిచ్చితో ఫ్లైఓవర్స్‌పై ఫొటోలు దిగి.. చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. ఒక చిన్న తప్పు వల్ల.. చాలా కుటుంబాల్లో తీవ్రమైన విషాదాలు నెలకొంటున్నాయి. ఈ ఘటనలను పరిశీలించిన ట్రాఫిక్ పోలీసులు.. పలు కఠినమైన చర్యలు తీసుకోనున్నారు. ఈ నెల 10వ తేదీన అర్థరాత్రి వంశీరాజ్, ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తులు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై.. సెల్ఫీలు […]

ఫ్లైఓవర్స్‌పై ప్రత్యేక నిఘా..! పోలీసుల కీలక సూచనలు..!
Follow us on

నగరంలోని ఫ్లైఓవర్స్‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నారు పోలీసులు. ప్రత్యేకమైన సీసీ కెమెరాలను ప్రతీ.. ఫ్లైఓవర్స్‌పై పెట్టనున్నారు. సెల్ఫీల పిచ్చితో ఫ్లైఓవర్స్‌పై ఫొటోలు దిగి.. చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. ఒక చిన్న తప్పు వల్ల.. చాలా కుటుంబాల్లో తీవ్రమైన విషాదాలు నెలకొంటున్నాయి. ఈ ఘటనలను పరిశీలించిన ట్రాఫిక్ పోలీసులు.. పలు కఠినమైన చర్యలు తీసుకోనున్నారు.

ఈ నెల 10వ తేదీన అర్థరాత్రి వంశీరాజ్, ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తులు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై.. సెల్ఫీలు తీసుకుంటుండగా.. ఇంతలో ఓ కారు వచ్చి వారిని ఢీ కొనగా.. వారు ఫ్లైఓవర్ మీద నుంచి కింద పడి.. అక్కడిక్కడే మరణించారు. అలాగో.. మరో ఇద్దరు కూడా.. అదే ఫ్లైఓవర్‌పై సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించగా.. గాయాలపాలయ్యారు. ఈ సందర్భంగానే.. పోలీసులు ఫ్లైఓవర్స్‌పై సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఒకవేళ ఉల్లంఘనలను గనుక ఎవరైనా వ్యతిరేకిస్తే.. భారీ మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు.

వాహనదారులకు పోలీసుల సూచనలు:

  • ప్రతీ ఫ్లైఓవర్స్‌పై సీసీ కెమెరాలు ఏర్పాటు
  • ఫ్లైఓవర్స్‌పై చిరుతిళ్లు తినడం.. సెల్ఫీలు దిగడం లాంటి పనులు అస్సలు చేయకూడదు
  • ఫ్లైఓవర్స్‌పై అనవసరంగా వాహనాలు ఆపరాదు
  • ఒకవేళ వాహనాలు చెడిపోతే.. ఫ్లైఓవర్ పక్కకి ఆపాలి
  • ఫ్లైఓవర్స్‌పై కార్లు చెడిపోతే.. డయల్ నెంబర్ 100కి ఫోన్‌ చేయాలి
  • ఫ్లైఓవర్స్‌పై అడ్డదిడ్డంగా వాహనాలను నిలిపి.. యాక్సిడెంట్‌లకు గురి కావద్దు
  • ముఖ్యంగా.. డ్రింక్ చేసి వాహనాలు నడపరాదు.