దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ కేసులో దర్యాప్తుకు మరికొంత సమయం కోరిన సీబీఐ

|

Dec 16, 2020 | 10:35 PM

సంచలనం సృష్టించిన హత్రాస్ అత్యాచారకేసు దర్యాప్తులో సీబీఐ మరింత గడువు కోరింది. అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ కు సీబీఐ హత్రాస్ కేసు దర్యాప్తులో మరికొంత గడువు కావాలని కోరింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ కేసులో దర్యాప్తుకు మరికొంత సమయం కోరిన సీబీఐ
Follow us on

సంచలనం సృష్టించిన హత్రాస్ అత్యాచారకేసు దర్యాప్తులో సీబీఐ మరింత గడువు కోరింది. అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ కు సీబీఐ హత్రాస్ కేసు దర్యాప్తులో మరికొంత గడువు కావాలని కోరింది. దాంతో  కోర్టు జనవరి 27 వరకు సీబీఐ కు సమయమిచ్చింది. తదుపరి విచారణను అదేరోజుకు వాయిదా వేస్తున్నట్టు కోర్టు పేర్కొంది. హత్రాస్‌కు చెందిన 19 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆ యువతి హాస్పటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తును డిసెంబర్ 10 నాటికల్లా పూర్తిచేస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఇప్పుడు ధర్మస్థానాని మరికొంత సమయం కోరింది సీబీఐ. ఇక బాధితురాలు చనిపోయిన తర్వాత రాత్రికి రాత్రే హుటాహుటిన దహనసంస్కారాలు చేయడం పై పలు విమర్శలు కూడా ఎదురయ్యాయి. తమ కూతురి మృతదేహాన్ని చివరిసారి ఇంటికికూడా తీసుకురాకుండా, తమ అనుమతి లేకుండా దహనసంస్కారాలు చేసారంటూ బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.