ఢిఫెన్స్‌డీలర్‌పై సీబీఐ కేసు నమోదు
డిఫెన్స్ డీలర్ సంజయ్ బండారీపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసింది. 2009లో స్విస్ సంస్థ పిలాటస్ ఎయిర్ క్రాఫ్ట్ లిమిటెడ్ 75 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్‌ల సేకరణ విషయంలో ముడుపులు తీసుకొని.. అవకతవకలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ ఢిల్లీలోని పంచశీల పార్క్‌లో ఉన్న సంజయ్ బండారీకి చెందిన ఆఫ్‌సెట్ ఇండియా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సంజయ్‌తో పాటు మరికొంత మంది వైమానిక దళ, […]
డిఫెన్స్ డీలర్ సంజయ్ బండారీపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసింది. 2009లో స్విస్ సంస్థ పిలాటస్ ఎయిర్ క్రాఫ్ట్ లిమిటెడ్ 75 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్‌ల సేకరణ విషయంలో ముడుపులు తీసుకొని.. అవకతవకలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.
ఈ నేపథ్యంలో దక్షిణ ఢిల్లీలోని పంచశీల పార్క్‌లో ఉన్న సంజయ్ బండారీకి చెందిన ఆఫ్‌సెట్ ఇండియా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సంజయ్‌తో పాటు మరికొంత మంది వైమానిక దళ, రక్షణ అధికారులకు కూడా ఈ ముడుపులతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.