విశాఖలో అడుగడుగునా తనిఖీలు..పట్టుబడిన కట్టల గుట్టలు.. ఒకటి కాదు రెండు కాదు కోట్లు..

|

Dec 21, 2020 | 8:22 PM

న్యూ ఇయర్‌ నేపథ్యంలో విశాఖ పోలీసులు యాంటీడ్రగ్స్‌ డ్రైవ్‌లు ముమ్మరం చేశారు. ఇంకేముంది.. దొంగలు దొరికారు. మూడు వేర్వేరు కేసుల్లో కోటి నగదు, 29కేజీల వెండి, 100 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

విశాఖలో అడుగడుగునా తనిఖీలు..పట్టుబడిన కట్టల గుట్టలు.. ఒకటి కాదు రెండు కాదు కోట్లు..
Follow us on

న్యూ ఇయర్‌ నేపథ్యంలో విశాఖ పోలీసులు యాంటీడ్రగ్స్‌ డ్రైవ్‌లు ముమ్మరం చేశారు. ఇంకేముంది.. దొంగలు దొరికారు. మూడు వేర్వేరు కేసుల్లో కోటి నగదు, 29కేజీల వెండి, 100 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

చూస్తున్నారుగా… డబ్బు కట్టల గుట్టలు… ఒకటా.. రెండా… కోటి రూపాయల నగదు.. అవును మీరు వింటున్నది నిజం… ఎవరిదో తెలీదు. కానీ విశాఖలోని ఓ ప్రైవేట్‌ లాడ్జ్‌లో ఇద్దరు వ్యక్తుల నుంచి ఈ క్యాష్‌ స్వాధీనం చేసుకున్నారు. వీరు
హైదరాబాద్‌ నుంచి వచ్చారని టాస్క్‌ఫోర్స్ పోలీసులు. కోటి రూపాయలను సీజ్‌ చేశారు.

పట్టుబడిన నగదు హవాలా క్యాష్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే అందులో ఒక్క రూపాయికి కూడా బిల్లులు గానీ, విత్‌డ్రాల్ రిసిప్ట్స్‌గానీ లేవు. కరెన్సీ స్వాధీనానికి సంబంధించి రాజస్థాన్‌కు చెందిన భరత్‌కుమార్‌, చోటూరామ్‌, అనే ఇద్దర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనివెనక ఇంకా ఎవరి పాత్ర ఉందన్నదానిపై ఆరా తీస్తున్నారు. కోటి నగదుపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు ఏసీపీ ప్రేమ్‌కాజల్.

అటు … మరో లాడ్జిలో 29 కిలోల వెండి ఆభరణాలను కూడా సీజ్ చేశారు. వీటికి కూడా ఎలాంటి బిల్లులు లేవు. దీనికి సంబంధించి హిమ్మత్‌సింగ్‌, సోహన్‌సింగ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. విజయవాడ నుంచి అక్రమంగా విశాఖకు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్టు గుర్తించామన్నారు. మరోవైపు దువ్వాడలో వాహనంలో తరలిస్తున్న 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్‌ గౌరవ్‌ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

క్యాష్‌, వెండి, గంజాయిపై వేర్వేరుగా కేసులు నమోదు చేశామన్నారు పోలీసులు. హవాలా మనీ, వెండి గంజాయి ఒకేసారి పట్టుబడటం కలకలం రేపుతోంది. ఈ మూడింటి వెనుక ఉన్న లింకులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.