కాపులపై కేసులు కొట్టేసిన జగన్ కేబినెట్

|

Dec 11, 2019 | 7:04 PM

ఏపీలోని కాపులకు మరో గుడ్ న్యూస్ ప్రకటించింది జగన్ సర్కార్. కాపు ఉద్యమ కాలంలో పెట్టిన కేసులను ప్రభుత్వం ఎత్తివేసింది. తుని ఘటనతో పాటు ఇతర ప్రాంతాల్లో జరిగిన కేసులన్నింటినీ ఎత్తివేయాలని ఏపీ కేబినెట్ బుధవారం నిర్ణయించింది. భోగాపురం విమానాశ్రయం భూసేకరణకు సంబంధించిన ఆందోళనకు సంబందించిన కేసులను కూడా కొట్టేయాలని జగన్ కేబినెట్ తీర్మానించింది. బుధవారం అమరావతిలో జరిగిన ఏపీ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న మరిన్ని నిర్ణయాలు: # రాజధాని భూసమీకరణ విషయంలో కీలక […]

కాపులపై కేసులు కొట్టేసిన జగన్ కేబినెట్
Follow us on

ఏపీలోని కాపులకు మరో గుడ్ న్యూస్ ప్రకటించింది జగన్ సర్కార్. కాపు ఉద్యమ కాలంలో పెట్టిన కేసులను ప్రభుత్వం ఎత్తివేసింది. తుని ఘటనతో పాటు ఇతర ప్రాంతాల్లో జరిగిన కేసులన్నింటినీ ఎత్తివేయాలని ఏపీ కేబినెట్ బుధవారం నిర్ణయించింది. భోగాపురం విమానాశ్రయం భూసేకరణకు సంబంధించిన ఆందోళనకు సంబందించిన కేసులను కూడా కొట్టేయాలని జగన్ కేబినెట్ తీర్మానించింది.

బుధవారం అమరావతిలో జరిగిన ఏపీ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న మరిన్ని నిర్ణయాలు:

# రాజధాని భూసమీకరణ విషయంలో కీలక నిర్ణయం.

# అసైన్డ్ భూములను నిబంధనలకు విరుద్దంగా కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగుకు ఇచ్చిన వ్యక్తుల రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేస్తూ నిర్ణయం.

# నిబంధనలకు విరుద్దంగా రిజిస్టరైన అసైన్డ్ భూములను గుర్తింపు.

# అధికారుల వద్దనున్న జాబితా ఆధారంగా అసైన్డ్ రిటర్నబుల్ ప్లాట్లను రద్దు.

# సుమారు 2500 ఎకరాల అసైన్డ్ భూముల విషయంలో అక్రమాలు జరిగాయని గుర్తించిన అధికారులు.

# అసలు అసైనీలకు యధాతధంగా ప్యాకేజీ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం.

# రాజధాని ప్రాంతంలో ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం

# ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ చట్టంలో సవరణలకు ఆమోదం.

# డిపార్ట్మెంట్ ఆఫ్ వార్డు, విలేజ్ సెక్రటేరియట్, వాలంటీర్ ఏర్పాటుకు ఆమోదం.

# సాధారణ పరిపాలన శాఖ పరిధిలోకి కొత్త శాఖ ఏర్పాటు.

# గ్రామ, వార్డు సచివాలయాలు,వాలంటీర్ల వ్యవస్థ పర్యవేక్షణ కోసం కొత్త శాఖ.