తండ్రి అయిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

| Edited By: Pardhasaradhi Peri

Apr 29, 2020 | 5:28 PM

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆయన భాగస్వామి క్యారీ సైమండ్స్ తలిదండ్రులయ్యారు. లండన్ లోని ఆసుపత్రిలో సైమండ్స్ బుధవారం పండంటి మగ బిడ్డకు జన్మ నిచ్చింది.

తండ్రి అయిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
Follow us on

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆయన భాగస్వామి క్యారీ సైమండ్స్ తలిదండ్రులయ్యారు. లండన్ లోని ఆసుపత్రిలో సైమండ్స్ బుధవారం పండంటి మగ బిడ్డకు జన్మ నిచ్చింది. తల్లీ, బిడ్డా ఇద్దరూ కులాసాగా, ఆరోగ్యంగా ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తాము తలిదండ్రులయ్యామన్న సమాచారం తెలియగానే దంపతులిద్దరూ థ్రిల్ అయ్యారట. నిజానికి క్యారీ సైమండ్స్ కి వచ్చే మే నెలలో కాన్పు జరగాల్సి ఉంది. ఏమైనప్పటికీ ఈ కొత్త వార్త వారికి ఆనందాన్ని ఇచ్చింది. ఇటీవలే బోరిస్ కరోనా వ్యాధి నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. కాగా-బోరిస్ జాన్సన్ కు తన మాజీ భార్య మెరీనా వీలర్ తో ఇదివరకే నలుగురు సంతానం ఉన్నారు. అధికార కన్సర్వేటివ్ పార్టీ కమ్యూనికేషన్స్ చీఫ్ గా వ్యవహరించిన క్యారీ సైమండ్స్ .. బోరిస్ ఇద్దరూ కొన్నేళ్ళక్రితమే సన్నిహితమయ్యారు. తాము త్వరలో పెళ్లి చేసుకోనున్నట్టు గత ఏడాది వీరు ప్రకటించారు. లోగడ అలెగ్రా మెస్టిన్ అనే మహిళను వివాహమాడిన బోరిస్ జాన్సన్ 1993 లో ఆమెకు విడాకులిఛ్చి.. ఆ తరువాత మెరీనా వీలర్ ను పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత ఆమెకు కూడా దూరమయ్యారు.