ఇండియాలో రైతుల ఆందోళనకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మద్దతు, స్పందించిన తొలి ప్రపంచనేత

ఇండియాలో రైతులు చేస్తున్న ఆందోళనకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మద్దతు ప్రకటించారు. శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నవారికి  తమ దేశం ఎప్పుడూ అండగా  ఉంటుందన్నారు.రైతుల నిరసన ప్రదర్శనల గురించి ఇండియా నుంచి తమకు సమాచారం  అందుతోందని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన  పేర్కొన్నారు.

ఇండియాలో రైతుల ఆందోళనకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మద్దతు, స్పందించిన తొలి ప్రపంచనేత
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 01, 2020 | 4:02 PM

ఇండియాలో రైతులు చేస్తున్న ఆందోళనకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మద్దతు ప్రకటించారు. శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నవారికి  తమ దేశం ఎప్పుడూ అండగా  ఉంటుందన్నారు.రైతుల నిరసన ప్రదర్శనల గురించి ఇండియా నుంచి తమకు సమాచారం  అందుతోందని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన  పేర్కొన్నారు.మేం ఎప్పుడూ కుటుంబం గురించి, స్నేహితుల గురించి వర్రీ అవుతుంటాం అని ఆయన… రైతులను తన కుటుంబంగా అభివర్ణించారు. కెనడా ఎల్లప్పుడూ శాంతియుత నిరసనకారుల హక్కులను సమర్థిస్తుందన్నారు. గురునానక్ 551 వ జయంతి సందర్భంగా జరిగిన ఆన్ లైన్ ఈవెంట్ లో జస్టిన్ ట్రూడో పాల్గొన్నారు. భారత్ లో అన్నదాతల ఆందోళనపై స్పందించిన తొలి ప్రపంచ నేత అయ్యారాయన.

సమస్యల పరిష్కారానికి జరిగే చర్చలపై తమకు నమ్మకం ఉందని, మా ఉద్దేశాలను నేరుగా భారతీయ అధికారులకు తెలియజేస్తున్నామని, ఇది మనమంతా కలిసి పరిష్కరించాల్సిన సమస్య అని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించినట్టు వరల్డ్ సిఖ్ ఆర్గనైజేషన్ ఓ వీడియోను పోస్ట్ చేసింది. గురు నానక్ జయంతి సందర్భంగా ఆయన వేరుగా ఓ స్టేట్ మెంట్ విడుదల చేస్తూ..కెనడాలోని సిక్కులకు ఇది అత్యంత ప్రధానమైన రోజని  పేర్కొన్నారు.

అటు-కెనడా రక్షణ మంత్రి హర్ జిత్ సింగ్ సజ్జన్ వేరొక ప్రకటనలో ఇండియాలో రైతులు జరుపుతున్న ఆందోళనపై స్పందిస్తూ..శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిపై  ‘అమానుష చర్యలు’ జరుగుతున్నట్టు వస్తున్న సమాచారం చాలా ఆందోళన కలిగిస్తోందన్నారు. తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు పలువురు అక్కడ (పంజాబ్, హర్యానారాష్ట్రాల్లో ) ఉన్నారని, వారు కూడా ఈ వార్తలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. బ్రిటన్ లోని కొంతమంది ఎంపీలు కూడా భారతీయ అన్నదాతల ప్రొటెస్ట్ పై స్పందించారు. ఇండియాలో… పంజాబ్ లోను, మరికొన్ని ప్రాంతాల్లోనూ తమ బంధువులు ఉన్నారని, బ్రిటన్ ఎంపీ తన్ మన్ జిత్ సింగ్ ధేసి ట్వీట్ చేశారు. రైతు చట్టాల ప్రైవేటీకరణపై మేం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం అని ఆయన ప్రకటించారు.

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
ఇద్దరే ఇద్దరూ! పంజాబ్‌తో మ్యాచ్ రోహిత్ కు చాలా స్పెషల్..
ఇద్దరే ఇద్దరూ! పంజాబ్‌తో మ్యాచ్ రోహిత్ కు చాలా స్పెషల్..
బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్.. కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు
బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్.. కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు
బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరోయిన్.. ప్రియుడి ఇంటి ముందు శవమై..
బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరోయిన్.. ప్రియుడి ఇంటి ముందు శవమై..