వ్యాక్సినేషన్ డ్రైవ్ ముగిసిన వెంటనే సీఏఏ, ఎన్ ఆర్ సీ అమలు, హోం మంత్రి అమిత్ షా ప్రకటన

| Edited By: Pardhasaradhi Peri

Feb 11, 2021 | 7:34 PM

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే సీఏఏ, ఎన్ ఆర్ సీ అమలు చేయడం ప్రారంభిస్తామని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. సీఏఏ అన్నది పార్లమెంట్ చేసిన చట్టమని..

వ్యాక్సినేషన్ డ్రైవ్ ముగిసిన వెంటనే సీఏఏ, ఎన్ ఆర్ సీ అమలు, హోం మంత్రి అమిత్ షా ప్రకటన
Follow us on

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే సీఏఏ, ఎన్ ఆర్ సీ అమలు చేయడం ప్రారంభిస్తామని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. సీఏఏ అన్నది పార్లమెంట్ చేసిన చట్టమని, దాన్ని ఎలా ఆపుతామని ఆయన ప్రశ్నించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని విఫలమైనదిగా ఆయన అభివర్ణించారు.  ఈ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ప్రధాని మోదీ ‘అభివృధ్ది మోడల్’ కి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ‘వినాశనకర మోడల్’ కి మధ్య పోరుకు ప్రత్యక్షంగా నిలుస్తాయన్నారు.  మమతా బెనర్జీ  కూడా త్వరలో జైశ్రీరామ్ అని నినాదాలు చేసే రోజులు వస్తాయని ఆయన చెప్పారు. కాగా-సీఏఏ, ఎన్ ఆర్ సీ చట్టాలను తాము అమలు చేయబోమని, తన ‘మృతదేహం’ పైనే వీటిని నిర్వహించాలని గతంలో మమత తీవ్రంగా వ్యాఖ్యానించిన విషయం గమనార్హం. ఈ చట్టాలను ఆమె పలు సందర్బఝాల్లో వ్యతిరేకిస్తూ మాట్లాడారు.

 

Also Read:

Vizag Steel Plant: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. 5 దశాబ్దాల తర్వాత మళ్ళీ అదే నినాదం.. తెర వెనుక అసలు కథ ఇదే!

ఆ ప్లేయర్‌ని ఈసారికి విడిచిపెట్టండి.. తమిళనాడు క్రికెట్ సంఘాన్ని కోరిన బీసీసీఐ.. ఎందుకో తెలుసా..