బ్రేకింగ్: తెలంగాణ మంత్రిగా కవిత..!

|

Mar 17, 2020 | 11:26 PM

నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత దాదాపు ఖరారు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఆమె రేపు(బుధవారం) నామినేషన్ వేయబోతున్నట్టుగా కూడా వార్తలు వెలువడుతున్నాయి. ఎల్లుండితో(గురువారం) తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం కూడా ముగియనుంది. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఆమెను సీఎం కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్నటివరకు కవితను రాజ్యసభకు పంపిస్తారని భావిస్తారు. కానీ వివిధ సమీకరణాల దృష్ట్యా సీనియర్ లీడర్ కేకేను మరోసారి పెద్దల సభకు పంపారు. ఆయనతో పాటు […]

బ్రేకింగ్:  తెలంగాణ మంత్రిగా కవిత..!
Follow us on

నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత దాదాపు ఖరారు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఆమె రేపు(బుధవారం) నామినేషన్ వేయబోతున్నట్టుగా కూడా వార్తలు వెలువడుతున్నాయి. ఎల్లుండితో(గురువారం) తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం కూడా ముగియనుంది. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఆమెను సీఎం కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్నటివరకు కవితను రాజ్యసభకు పంపిస్తారని భావిస్తారు. కానీ వివిధ సమీకరణాల దృష్ట్యా సీనియర్ లీడర్ కేకేను మరోసారి పెద్దల సభకు పంపారు. ఆయనతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్‌కు సముచిత స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతో సురేష్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. దీంతో కవితకు మంత్రి పదవి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రాజ్యసభకు పంపలేదని తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.