మజ్జిగ చారుతో ఆరోగ్యానికి ఎన్నో ఉప‌యోగాలు !

| Edited By: Pardhasaradhi Peri

Aug 02, 2020 | 3:33 PM

ప్ర‌స్తుత క‌రోనా స‌మ‌యంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకోవ‌డంపైనే అంద‌రూ ఫోక‌స్ పెట్టాలి. మ‌నలో యాంటీబాడీస్ పుష్క‌లంగా ఉంటే అనుకోని ప‌రిస్థితుల్లో వైర‌స్ దాడి చేసినా..దాన్ని ఎదిరించ‌వ‌చ్చు.

మజ్జిగ చారుతో ఆరోగ్యానికి ఎన్నో ఉప‌యోగాలు !
Follow us on

ప్ర‌స్తుత క‌రోనా స‌మ‌యంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకోవ‌డంపైనే అంద‌రూ ఫోక‌స్ పెట్టాలి. మ‌నలో యాంటీబాడీస్ పుష్క‌లంగా ఉంటే అనుకోని ప‌రిస్థితుల్లో వైర‌స్ దాడి చేసినా..దాన్ని ఎదిరించ‌వ‌చ్చు. మ‌జ్జిగ చారు కూడా మ‌నుషులు ఆరోగ్యంగా ఉండ‌డానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. కిచెన్ లో అందుబాటులో ఉండే వస్తువుల‌తోనే దీన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. పెరుగు లేదా మజ్జిగలో ఉండే బ్యాక్టీరియా మ‌న‌కు మేలు చేస్తుందున్న విష‌యం తెలిసిందే. పులిసిన మజ్జిగలో మంచి బ్యాక్టీరియా రెట్టింపు శాతంలో ఉంటుంది. ఇది పేగుల్లోని చెడు బ్యాక్జీరియాను నశింపజేయ‌డానికి స‌హ‌క‌రిస్తోంది. శరీరంలోకి ఎలాంటి వైరస్‌లు ఎంట‌ర‌వ్వ‌కుండా ర‌క్ష‌ణ ఇస్తుంది. ఇక మజ్జిగలోని ల్యాక్టిక్‌ ఆమ్లం కొవ్వు పెరగకుండా సాయం చేస్తోంది. ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు ఉప‌క‌రిస్తుంది. వేడిని త‌గ్గించ‌డంలో మ‌జ్జిగ చారు బేషుగ్గా పనిచేస్తుంది. వంట ఇంట్లోనే రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకోడానికి మంచి మార్గం ఉంటే. ఇంకా ఆలోచిస్తారెందుకు. ఇవాళే మ‌జ్జిగ చారుతో ఓ ప‌ట్టు ప‌ట్టేయండి.

 

Also Read : సిద్దిపేట‌ టిక్‌టాక్‌ సింగర్‌ రాజు ఆత్మహత్య