భోపాల్ నుంచి ఢిల్లీకి.. నలుగురి కోసం.. 180 సీట్ల విమానం అద్దెకు..

| Edited By:

May 28, 2020 | 5:08 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్‌డౌన్ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో మద్యం వ్యాపారి తన కుటుంబ సభ్యులు నలుగురిని

భోపాల్ నుంచి ఢిల్లీకి.. నలుగురి కోసం.. 180 సీట్ల విమానం అద్దెకు..
Follow us on

Businessman Hires Plane: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్‌డౌన్ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో మద్యం వ్యాపారి తన కుటుంబ సభ్యులు నలుగురిని భోపాల్ నుంచి ఢిల్లీకి తరలించేందుకు ఓ ఏకంగా 180 సీట్ల ప్రైవేట్ విమానాన్ని అద్దెకు తీసుకున్నాడు. ఆయన తన కుమార్తె, ఆమె ఇద్దరు పిల్లలు, పనిమనిషిని ఢిల్లీకి తీసుకొచ్చేందుకు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కాగా.. కరోనా మహమ్మారి కట్టడికోసం విధించిన లాక్‌డౌన్ కారణంగా వీరందరూ గత రెండు నెలలుగా భోపాల్‌లో చిక్కుకుపోయారు. సోమవారం ఢిల్లీ నుంచి సిబ్బందితో మాత్రమే భోపాల్ వచ్చిన విమానం కేవలం నలుగురితో తిరిగి బయలుదేరింది. ‘‘ఓ కుటుంబంలో నలుగురు వ్యక్తుల కోసం ఎ320 180 సీట్ల ప్రైవేటు విమానం వచ్చింది. బహుశా కరోనా వైరస్ భయం వల్ల కావొచ్చు. దీనిని ఎవరో అద్దెకు తీసుకున్నారు’’ అని ఎయిర్‌లైన్ అధికారి ఒకరు చెప్పారు.

మరోవైపు.. ఎయిర్‌బస్ 320 అద్దె దాదాపు రూ. 20 లక్షలు ఉంటుందని ఏవియేషన్ నిపుణులు చెబుతున్నారు. భోపాల్ నుంచి నలుగురిని ఢిల్లీకి రప్పించేందుకు రూ. 20 లక్షలు ఖర్చుచేసిన ఆ వ్యాపారి ఎవరై ఉంటారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.