ప్రయాణికులకు చేదువార్త.. బస్సు ఛార్జీలు పెంచిన కేసీఆర్..!!

| Edited By:

Nov 28, 2019 | 9:19 PM

ఈ న్యూస్ ప్రయాణికులకు చేదువార్త అనే చెప్పాలి. తప్పనిసరి పరిస్థితిల్లో బస్సు ఛార్జీలను పెంచుతున్నట్లు వెల్లడించిన సీఎం కేసీఆర్. కేబినెట్ భేటీలో భాగంగా.. తప్పనిసరిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ వివరించారు. కిలోమీటర్‌కు 20 పైసలు చొప్పున ఛార్జీలు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. తద్వారా.. ప్రభుత్వానికి 750 కోట్ల ఆదాయం రానుందని.. ఇది ఆర్టీసీ బతకడానికి ఛాన్స్ ఉంటుందని కేసీఆర్ చెప్పారు. దీంతో.. బస్సు ప్రయాణికులకు మరింత భారం పడే అవకాశం ఉంది. ఇప్పటికే.. పెరిగిన […]

ప్రయాణికులకు చేదువార్త.. బస్సు ఛార్జీలు పెంచిన కేసీఆర్..!!
Follow us on

ఈ న్యూస్ ప్రయాణికులకు చేదువార్త అనే చెప్పాలి. తప్పనిసరి పరిస్థితిల్లో బస్సు ఛార్జీలను పెంచుతున్నట్లు వెల్లడించిన సీఎం కేసీఆర్. కేబినెట్ భేటీలో భాగంగా.. తప్పనిసరిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ వివరించారు. కిలోమీటర్‌కు 20 పైసలు చొప్పున ఛార్జీలు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. తద్వారా.. ప్రభుత్వానికి 750 కోట్ల ఆదాయం రానుందని.. ఇది ఆర్టీసీ బతకడానికి ఛాన్స్ ఉంటుందని కేసీఆర్ చెప్పారు. దీంతో.. బస్సు ప్రయాణికులకు మరింత భారం పడే అవకాశం ఉంది. ఇప్పటికే.. పెరిగిన ఛార్జీలతో ప్రయాణికులు సతమతమవుతుంటే.. ఇవి ఇంకాస్త ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి. అయితే.. చమురుధరలు అధికమవడంతోపాటుగా.. లోబడ్జెట్ కారణంగా.. ఈ రేట్లు పెంచుతున్నట్లు కేసీఆర్ చెప్పారు.

కాగా.. ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ శుభవార్త చెప్పారు. తమ ప్రభుత్వం ఎవరి పొట్టలు కొట్టలేదని.. దేశం మొత్తంలో చూసుకుంటే.. తెలంగాణలో మాత్రమే ఆర్టీసీ కార్మికులకు ఎక్కువ జీతాలు ఇస్తున్నామని అన్నారు. యూనియన్ల మాటలు విని ఆర్టీసీ కార్మికులు పెడదారి పడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీ పాలిట రాష్ట్రాల్లోనే ఇప్పటివరకు ఆర్టీసీని విలీనం చేయలేదన్నారు. ఆర్టీసీ సమ్మె, దాని పరిణామాలకు యూనియన్లదే పూర్తి బాధ్యతని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వం ముందు నుంచీ విధుల్లో చేరమని చెప్పినా.. ఎవరూ వినలేదన్నారు. యూనియన్లు లేనిపోని ఆశలు కల్పించి కార్మికులను బలిపశువులు చేశారని అన్నారు. రేపటి నుంచి కార్మికులు విధుల్లోకి చేరమని చెప్పారు సీఎం కేసీఆర్.