బుసలు కొడుతోన్న బురేవి.. నెల్లూరు, చిత్తూరుజిల్లాలో కలవరం.. మరో మూడురోజుల పాటు ప్రభావం

|

Dec 06, 2020 | 5:51 AM

బురేవి తుఫాను ఇంకా బుసలు కొడుతోంది. తీరప్రాంతాల్లో కలవరం రేపుతోంది. తుఫాన్‌ ధాటికి తమిళనాడుతోపాటు చిత్తూరు...

బుసలు కొడుతోన్న బురేవి.. నెల్లూరు, చిత్తూరుజిల్లాలో కలవరం.. మరో మూడురోజుల పాటు ప్రభావం
Follow us on

బురేవి తుఫాను ఇంకా బుసలు కొడుతోంది. తీరప్రాంతాల్లో కలవరం రేపుతోంది. తుఫాన్‌ ధాటికి తమిళనాడుతోపాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే తీరం దాటాల్సిన బురేవి తుఫాన్‌ .. రామనాథపురంకు 40 కిలోమీటర్ల దూరంలో స్థిరంగా కొనసాగుతోంది. మూడురోజుల పాటు దీని ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తీవ్రవాయుగుండంగా ఉన్న బురేవి తుఫాన్‌ బలహీనపడి వాయుగుండంగా మారింది. దీని ఎఫెక్ట్‌ ఈనెల 8 వరకు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. 40 గంటల పాటు తీరంలోనే బురేవి కొనసాగనుందని వాతావరణ శాఖ తెలపడంతో.. తీర ప్రాంతాల అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు పడుతుండడంతో.. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు.. అక్కడి జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వరుస తుఫానుల ధాటికి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు.. తుఫాన్‌ ప్రభావం పంటలపై పడుతుండడంతో మంత్రి ఆదిమూలపు సురేష్‌ సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ అధికారుల నుంచి వివరాలను తెప్పించుకున్నారు. నష్టపోయిన ప్రతీ రైతు వివరాలను నమోదు చేసి, ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి సురేష్‌.