తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమలపై జరిగిన దాడిని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆరోపించారు. ఇదిలా ఉంటే బోండా ఉమ, బుద్దా వెంకన్నతో చంద్రబాబు పార్టీ కార్యాలయం నుంచి ఫోన్‌లో మాట్లాడి దాడికి సంబంధించి వివరాలు తెలుసుకున్నారు.
ముందుగా లాయర్ కిశోర్ మాట్లాడుతూ.. టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ను అనుమతించకపోవడంతో న్యాయపరమైన సమస్య పరిష్కారానికి తాను వెళ్లాననీ, ఒక్కసారిగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కారుపై దాడి చేశారనీ, తలకు తీవ్రగాయాలయ్యాయని చెప్పారు. తమపై దాడి జరుగుతుండటంతో డ్రైవర్ వెంటనే కారును వేగంగా పక్కకు మళ్లించడంతో బతికిపోయామని చెప్పారు. ఇక బోండా ఉమ మాట్లాడుతూ… నిన్న నిన్న నామినేషన్ ప్రక్రియను అడ్డుకున్నారని తామంతా వెళ్లామనీ, తాను, వెంకన్న ప్రయాణిస్తున్న కారుపై ఒక్కసారిగా దాడి చేశారని అన్నారు.
వారి నుంచి తప్పించుకుని మర్కాపురం వైపు వెళ్తుంటే మళ్లీ అడ్డుకున్నారనీ.. పోలీసులు ఉన్నా మాపై దాడి చేశారనీ.. గన్ మెన్ తుపాకీ చూపిస్తే అతనిపై కూడా దాడి చేయంతో దీంతో గన్‌మెన్ పరారయ్యారన్నారు. పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చినా సురక్షితంగా తీసుకెళ్తారనే నమ్మకం తమకు లేదన్నారు. మాకు రక్షణగా వచ్చిన డీఎస్పీ వాహనంపైనా దాడి చేశారని ఉమ చెప్పుకొచ్చారు.
ఇది దుర్మార్గమైన చర్య అని అన్నారు బుద్దా వెంకన్న. ప్రాణాలతో తిరిగొస్తామనే నమ్మకం లేదనీ.. ప్రస్తుతం దుర్గి చేరుకున్నామని చంద్రబాబుకు ఫోన్‌లో వివరించారు. అడుగడుగునా అడ్డుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతానికి పోలీసు వాహనంలోనే ఉన్నామని… ఈ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారని ఫోన్‌లో చంద్రబాబుతో పేర్కొన్నారు వెంకన్న.
Read More this also: లాయర్ తల పగిలింది.. మేము ప్రాణాలతో.. వస్తామో.. రామో..
టీడీపీ నేతల కారుపై దాడి.. చంద్రబాబు ఫైర్