బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్.. యూజర్లకు ఫ్రీగా డబ్బులిస్తారట.?

|

Nov 08, 2019 | 5:51 PM

ఈ విచిత్రమైన ఆఫర్ ఏంటీ.. ఎదురు డబ్బులు ఇవ్వడమేంటని ఆలోచిస్తున్నారా.? ఇదంతా వట్టి రూమర్ అనుకుంటే పొరపాటు. ఈ ఆఫర్‌ను స్వయంగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది. ఇంతకీ వారు ప్రకటించిన పథకం వింటే ఖచ్చితంగా మీరు షాక్ అవ్వాల్సిందే. బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ నుంచి ఎవరికైనా ఔట్‌గోయింగ్ కాల్ చేసి.. ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు మాట్లాడితే వారికి 6 పైసలు ఎదురు చెల్లిస్తామని సంస్థ అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా ఐదు నిమిషాల కాల్స్ […]

బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్.. యూజర్లకు ఫ్రీగా డబ్బులిస్తారట.?
Follow us on

ఈ విచిత్రమైన ఆఫర్ ఏంటీ.. ఎదురు డబ్బులు ఇవ్వడమేంటని ఆలోచిస్తున్నారా.? ఇదంతా వట్టి రూమర్ అనుకుంటే పొరపాటు. ఈ ఆఫర్‌ను స్వయంగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది. ఇంతకీ వారు ప్రకటించిన పథకం వింటే ఖచ్చితంగా మీరు షాక్ అవ్వాల్సిందే.

బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ నుంచి ఎవరికైనా ఔట్‌గోయింగ్ కాల్ చేసి.. ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు మాట్లాడితే వారికి 6 పైసలు ఎదురు చెల్లిస్తామని సంస్థ అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా ఐదు నిమిషాల కాల్స్ ఎన్ని చేసినా కూడా.. డబ్బులు ఖచ్చితంగా తిరిగి ఇస్తామని ఢిల్లీ బ్రాంచ్ బీఎస్ఎన్ఎల్ ఎండీ వివేక్ బాంజల్ హామీ ఇచ్చారు.

ఇదే కాకుండా బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ వినియోగదారులకు మరిన్ని అద్భుతమైన ఆఫర్స్ కూడా ప్రకటించారు. వారికి నెలరోజుల పాటు ఉచితంగా బ్రాడ్ బ్యాండ్, వైఫై సేవలతో పాటుగా 10 ఎంబీపీఎస్ స్పీడ్‌తో రోజుకి 5 జీబీ డేటాను కూడా వాడుకోవచ్చని అంటున్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి ఆఫర్లు వివిధ రకాల టెలికాం ఆపరేటర్స్ కూడా ఇస్తుండటంతో వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు మొగ్గు చూపుతారో లేదో వేచి చూడాలి.

ఏది ఏమైనా ‘జియో’ వచ్చిన తర్వాత టెలికాం రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పాలి. అంతేకాకుండా ఇలాంటి ఆఫర్ బీఎస్‌ఎన్‌ఎల్ గతంలోనే ప్రవేశ పెట్టినట్లయితే సదరు సంస్థ పరిస్థితి మెరుగుపడేదని కొందరి భావన.