ఖరీదైన బ్రౌన్ రైస్ నిజంగానే ఆరోగ్యకరమా? తెల్ల బియ్యంతో పోలిస్తే ఏది మేలు?
మన భారతీయ భోజనంలో అన్నం ఒక ముఖ్యమైన భాగం. అయితే, బరువు తగ్గాలని అనుకునేవారు ముందుగా చేసే పని అన్నం తినడం పూర్తిగా మానేయడం లేదా వైట్ రైస్ స్థానంలో బ్రౌన్ రైస్ చేర్చుకోవడం. సోషల్ మీడియాలో వైట్ రైస్‌ను ఒక విలన్‌గా చిత్రీకరిస్తూ, బరువు తగ్గడానికి ఖరీదైన బ్రౌన్ రైస్ ఒక్కటే మార్గం అనే ప్రచారం జరుగుతోంది. కానీ, ఆరోగ్యానికి ఏది నిజంగా మంచిది? బరువు తగ్గడానికి ఏ రైస్ ఎంచుకోవాలి? అసలు విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు తగ్గాలనుకునే వారు వైట్ రైస్ పూర్తిగా మానేసి, ఖరీదైన బ్రౌన్ రైస్ మాత్రమే తినాలనే భ్రమ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు ఫిట్‌గా ఉండాలనుకుంటే తెల్ల బియ్యం తినడం మానేసి, ఈ రోజు నుంచే బ్రౌన్ రైస్ తినడం ప్రారంభించండి. ఈ రోజుల్లో ప్రతి వీధిలో ప్రతి ఫిట్‌నెస్ గురువు ఇదే సలహా ఇస్తున్నారు. దీని కారణంగా, పేదల తెల్ల బియ్యం ఆరోగ్యానికి విలన్‌గా మారింది. మీరు బరువు తగ్గాలనుకుంటే, ఖరీదైన బ్రౌన్ రైస్ తినడమే ఏకైక మార్గం అని సోషల్ మీడియాలో ఒక పెద్ద అపోహ వ్యాపించింది. కానీ, మీ ఆరోగ్యానికి ఏ బియ్యం మంచిదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
భోజనంలో అన్నం లేకపోతే చాలా మందికి ఆ భోజనం అసంపూర్ణంగా అనిపిస్తుంది. కానీ, గత కొన్ని సంవత్సరాలుగా, ఫిట్‌నెస్ వైపు చాలా మందిలో ఆసక్తి పెరిగింది. కానీ, ఆరోగ్యానికి ఏ బియ్యం మంచిదో చాలా మందికి తెలియదు. బరువు తగ్గాలనుకునే వారి మనసులో మెదిలే ఏకైక ప్రశ్న తెల్ల బియ్యం తినాలా లేక బ్రౌన్ రైస్ తినాలా? బరువు పెరుగుతామనే భయంతో చాలా మంది అన్నం తినడం మానేస్తారు. కా,నీ అది నిజంగా అవసరమా? మన ఆరోగ్యానికి, పొట్ట కొవ్వును తగ్గించడానికి ఏ బియ్యం మంచిదో చూద్దాం.
బ్రౌన్ రైస్‌ను హోల్ గ్రెయిన్ అంటారు. దీనిపై పెద్దగా పాలిషింగ్ ప్రక్రియలు జరగవు. కాబట్టి, గింజపై ఉండే తవుడు, పోషకాలు అలాగే సురక్షితంగా ఉంటాయి. బ్రౌన్ రైస్‌లో ఫైబర్ చాలా ఎక్కువ. ఇది తిన్న తర్వాత కడుపు నిండుగా ఉంచి, పదే పదే ఆకలి వేయకుండా చేస్తుంది. దీనివల్ల క్యాలరీల వినియోగం తగ్గి బరువు తగ్గడం సులువవుతుంది. అలాగే మలబద్ధకం తగ్గుతుంది. మధుమేహం (షుగర్) ఉన్నవారికి బ్రౌన్ రైస్ ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని ఫైబర్ కారణంగా చక్కెర రక్తంలో చాలా నిమ్మదిగా కలుస్తుంది. తద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యానికి కూడా ఇది మంచిది.
వైట్ రైస్ నిజంగానే హానికరమా?
వైట్ రైస్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదనే అపోహ అవసరం లేదు. పాలిషింగ్ చేయడం వల్ల దీనిలోని ఫైబర్, కొన్ని విటమిన్లు తగ్గిపోతాయి అనేది నిజమే అయినా, దీనికి కొన్ని ప్రత్యేక గుణాలు ఉన్నాయి. వైట్ రైస్ చాలా తేలికగా జీర్ణమవుతుంది. జీర్ణవ్యవస్థ సరిగ్గా లేనప్పుడు లేదా కడుపు నొప్పిగా ఉన్నప్పుడు వైట్ రైస్ తినడం సురక్షితం. అలాగే, వర్కవుట్స్ చేసిన తర్వాత శరీరానికి తక్షణ శక్తి (Instant Energy) కావాలన్నప్పుడు వైట్ రైస్ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే దీని గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ కాబట్టి, తిన్న వెంటనే బ్లడ్ షుగర్ వేగంగా పెరుగుతుంది.
మరీ ఏది బెటర్?:
మీరు బరువు తగ్గడం, బెల్లీ ఫ్యాట్ కరిగించడం, డయాబెటిస్ నియంత్రణ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటే.. బ్రౌన్ రైస్ మీ డైట్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్. అలా కాకుండా కేవలం శక్తి కోసం, సులభంగా జీర్ణమవ్వడం కోసం అయితే పరిమిత మోతాదులో వైట్ రైస్ కూడా తీసుకోవచ్చు. మీ ఆరోగ్య అవసరాలను బట్టి సరైన నిర్ణయం తీసుకోండి.




