ఈ నెల 26 న రిపబ్లిక్ దినోత్సవం నాడు ఢిల్లీ ఎర్రకోట వద్ద రైతుల ఆందోళన హింసాత్మకంగా మారింది. అంతవరకు ప్రశాంతంగా సాగుతుందనుకున్న నిరసన ఉగ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా రెడ్ ఫోర్ట్ వద్ద ఉద్రిక్తత పరాకాష్టకు చేరింది. వందల సంఖ్యలో అన్నదాతలు దూసుకువఛ్చి అక్కడి ఫ్లాగ్ పోల్ పైకి ఎక్కి తమ నిరసన తాలూకు నిషాబ్ జెండాలు ఎగురవేశారు. సిక్కు మత చిహ్నానికి గుర్తయిన ఈ పతాకాలను ఆ స్తంభం మీద ఎగురవేసి తమ ఆందోళనను మరింత ఉధృతం చేశాయి. ఇక్కడ జరిగిన విధ్వంసానికి విరిగిన గేట్లు, చెల్లాచెదరుగా పడి ఉన్న గాజుముక్కలు, ధ్వంసమైన టికెట్ కౌంటర్ సాక్షీభూతాలుగా నిలిచాయి. గణ తంత్ర దినోత్సవం నాడు జరిగిన ఈ సీన్ ఇంకా అలాగే ఉంది.