చమురు కంపెనీ సంచలన నిర్ణయం.. 10 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన..

కోవిద్-19 దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. దీంతో బ్రిటన్‌కు చెందిన దిగ్గజ చమురు కంపెనీ బీపీ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి 10 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోందని సమాచారం. సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో వీరి సంఖ్య దాదాపు 15 శాతానికి సమానం. వీరిలో అధిక శాతం మంది సంస్థ కార్యాలయ్యాల్లో పని చేసే సీనియర్ ఉద్యోగులట. క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందిపై మాత్రం ఎటువంటి ప్రభావం […]

చమురు కంపెనీ సంచలన నిర్ణయం.. 10 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన..

Edited By:

Updated on: Jun 08, 2020 | 8:41 PM

కోవిద్-19 దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. దీంతో బ్రిటన్‌కు చెందిన దిగ్గజ చమురు కంపెనీ బీపీ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి 10 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోందని సమాచారం. సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో వీరి సంఖ్య దాదాపు 15 శాతానికి సమానం. వీరిలో అధిక శాతం మంది సంస్థ కార్యాలయ్యాల్లో పని చేసే సీనియర్ ఉద్యోగులట. క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందిపై మాత్రం ఎటువంటి ప్రభావం ఉండబోదని తెలిసింది.

బ్రిటన్‌లోని చమురు కంపెనీ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందిపైనే ఈ నిర్ణయం ప్రభావం అత్యధికంగా ఉంటుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. 2020లో సంస్థ వ్యయంలో 25 శాతం కోత ఉంటుందని ఏప్రిల్‌లో ప్రకటించిన యాజమాన్యం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి సదరు సంస్థను ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో యాజమాన్యం ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.