మీరు ఒంటరి వాళ్లు కారు..బ్రిటన్​ రాణి ఎలిజబెత్​2 క్రిస్మస్ సందేశం..వేడుకలకు దూరంగా ఉన్న బ్రిటన్​ రాజదంపతులు

|

Dec 27, 2020 | 12:38 AM

బ్రిటన్‌ రాణి రెండో ఎలిజబెత్‌ తన క్రిస్మస్‌ సందేశంలో ఈ ఏడాది కరోనా మిగిల్చిన విషాదాన్ని ప్రస్థావించారు. మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళ్లర్పించడంతో పాటు ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, వాంటీర్ల సేవలను ప్రశంసించారు.

మీరు ఒంటరి వాళ్లు కారు..బ్రిటన్​ రాణి ఎలిజబెత్​2 క్రిస్మస్ సందేశం..వేడుకలకు దూరంగా ఉన్న బ్రిటన్​ రాజదంపతులు
Follow us on

బ్రిటన్‌ రాణి రెండో ఎలిజబెత్‌ తన క్రిస్మస్‌ సందేశంలో ఈ ఏడాది కరోనా మిగిల్చిన విషాదాన్ని ప్రస్థావించారు. మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళ్లర్పించడంతో పాటు ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, వాంటీర్ల సేవలను ప్రశంసించారు.

కరోనా కారణంగా సన్నిహితులు లేకుండా ఈ సారి పండుగలను ఒంటరిగా జరుపుకోవాల్సి వచ్చిందని బాధపడిన వారు ఒంటరి వాళ్లు కారని బ్రిటన్​ రాణి ఎలిజబెత్​ అన్నారు. ఈ మేరకు క్రిస్మస్ వీడియో సందేశాన్ని పంపించారు. విండోర్స్​ లో జరిగిన దీపావళి పండుగను క్వీన్​ ఉదహరించారు. భౌతిక దూరంతో ఉన్నా మనందరిలో ఐక్యమత్యాన్ని , ఆశలను దీపావళి ప్రతిబింబించిందని గుర్తుచేశారు. క్రిస్మస్ కాంతులు అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని కోరారు.

ఈ సంవత్సరం కరోనా భౌతికంగా ఎవరిని కలవకుండా దూరంగా ఉంచినా.. మానసికంగా దగ్గరయ్యేలా చేసిందని పేర్కొన్నారు. 2020 విసిరిన సవాళ్లను బ్రిటనే కాకుండా ప్రపంచ దేశాల ప్రజలు ధీటుగా ఎదర్కొన్నారని వ్యాఖ్యానించారు.

కరోనా పోరులో ముందుండి నడిచినవారు నిస్వార్థ సేవకులని కొనియాడారు. ఎలిజబెత్​ దంపతులు తమ నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడకలలో పాల్గొనలేదు. బ్రిటన్​ రాజదంపతులు క్రిస్మస్ వేడుకలలో పాల్లొనకపోవడం 1980 తరువాత ఇదే మొదటిసారి.