Breaking: వ్యవసాయ బావిలో పడ్డ జీపు..

వరంగల్‌ రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగెం మండలం గవిచర్ల వద్ద జీపు అదుపుతప్పి వ్యవసాయ బావిలో పడింది. ఈ ప్రమాద ఘటన జరిగిన సమయంలో జీపులో 16 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

Breaking: వ్యవసాయ బావిలో పడ్డ జీపు..

Edited By:

Updated on: Oct 27, 2020 | 7:09 PM

వరంగల్‌ రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగెం మండలం గవిచర్ల వద్ద జీపు అదుపుతప్పి వ్యవసాయ బావిలో పడింది. ఈ ప్రమాద ఘటన జరిగిన సమయంలో జీపులో 16 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇది గమనించిన స్థానికులు అందులో 12 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మరో నలుగురిని వెలికితీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వరంగల్ నుంచి నెక్కొండ వెళ్తుండగా రోడ్డు సరిగా లేకపోవడంతో జీపు అదుపు తప్పినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us