Moderna Covid vaccine: అమెరికా వైద్యుడికి తీవ్ర అలర్జీ… ఆందోళన అవసరం లేదన్న యూఎస్ అధికారులు…

| Edited By:

Dec 26, 2020 | 10:35 AM

అమెరికాలో కరోనాను అదుపులోకి తెచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం మోడెర్నా, ఫైజర్ టీకాలను ప్రజలకు అందిస్తోంది. డిసెంబర్ 24న మొదటి రోజే పది లక్షలకు పైగా మందికి కరోనా వ్యాక్సిన్‌ను అందించింది.

Moderna Covid vaccine: అమెరికా వైద్యుడికి తీవ్ర అలర్జీ... ఆందోళన అవసరం లేదన్న యూఎస్ అధికారులు...
Follow us on

అమెరికాలో కరోనాను అదుపులోకి తెచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం మోడెర్నా, ఫైజర్ టీకాలను ప్రజలకు అందిస్తోంది. డిసెంబర్ 24న మొదటి రోజే పది లక్షలకు పైగా మందికి కరోనా వ్యాక్సిన్‌ను అందించింది. రానున్న రోజుల్లో కోటి మందికిపైగా టీకాను అందించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దానిలో భాగంగానే ఇప్పటికే 20 మిలియన్ల ఫైజర్, మోడెర్నా టీకాలను అమెరికాకు తెప్పించింది.

 

అమెరికా బోస్టన్‌లోని ఓ వైద్యుడికి తీవ్ర అలర్జీ…

అమెరికా వ్యాప్తంగా కరోనా టీకాను అందిస్తున్న నేపథ్యంలో ప్రముఖ న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. అందులో విస్తుపోయే నిజాలను వెలువరించింది. డా. హొస్సేన్ అనే వ్యక్తికి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపింది. రెండు రోజుల వ్యవధిలో ఆయనకు అలర్జీ వంటి సమస్యలు ఏర్పాడ్డాయని పేర్కొంది. అతడి కళ్లు బైర్లు కమ్మాయని, గుండె వేగంగా కొట్టుకుందని రాసింది. వెంటనే అతడిని బోస్టన్ మెడికల్ సెంటర్‌కు తరలించినట్లు యూఎస్ ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన డేవిడ్ తెలిపినట్లు పేర్కొంది. డా.హొస్సేన్ ఆరోగ్యం ఇప్పుడు నిలకడడంతో ఆస్పత్రిని డిచ్చార్జ్ చేసినట్లు పేర్కొంది. కాగా, అమెరికా ప్రభుత్వం టీకా వేసుకున్న వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే ఆస్పత్రిలో చేరాలని, వైద్యులను సంప్రదించాలని సూచించింది.