ముద్దుగుమ్మల తెలివైన సమాధానాలు..

|

Sep 28, 2020 | 9:15 PM

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో బుక్కైన హీరోయిన్లు ఎన్సీబీ విచారణలో చాలా తెలివిగా సమాధానాలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా దీపికా విచారణ సందర్భంగా సంచలన విషయాలు వెలుగు లోకి వచ్చాయి.

ముద్దుగుమ్మల తెలివైన సమాధానాలు..
Follow us on

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో బుక్కైన హీరోయిన్లు ఎన్సీబీ విచారణలో చాలా తెలివిగా సమాధానాలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా దీపికా విచారణ సందర్భంగా సంచలన విషయాలు వెలుగు లోకి వచ్చాయి. డ్రగ్స్‌ చాటింగ్‌ నిజమేనన్న దీపికా.. తాను ఎప్పుడు డ్రగ్స్‌ సేవించలేదని స్పష్టం చేశారు. చాటింగ్‌లో తాము ఉపయోగించిన పదం మాల్‌ అంటే సన్న సిగరెట్‌ అని దీపికా చెప్పినట్లుగా తెలుస్తోంది.

హాష్‌ అంటే కూడా సిగరెట్లే అని దీపికా సమాధానం ఇచ్చారు. తాను డ్రగ్స్‌ సేవించలేదని , సిగరెట్లు మాత్రమే తాగినట్టు స్పష్టం చేశారు. శ్రద్దా కపూర్‌, సారా అలీఖాన్‌ కూడా ఇలాంటి సమాధానాలు ఇవ్వడంతో ఈ ముగ్గురికి ఎవరో హోమ్‌ ట్యూషన్‌ చెప్పినట్టు అనుమానాలు కలుగుతున్నాయని ఎన్సీబీ అధికారులు అంటున్నారు.

ఎన్సీబీ అధికారులు దీపికతో పాటు సారా , శ్రద్దా సెల్‌ఫోన్లను సీజ్‌ చేశారు. మొబైల్‌ డేటాను రిట్రీవ్‌ చేసే పనిలో ఉన్నారు ఎన్సీబీ అధికారులు.