
Sonu Sood :వలస కూలీల పాలిట దేవుడిగా మారిన రీల్ విలన్.. రియల్ హీరో సోనూ సూద్‌కు అరుదైన గౌరవం దక్కింది. లాక్ డౌన్ సమయంలో వేలాదిమంది కూలీలకు అండగా నిలిచి రియల్‌హీరో అందరి మన్ననలు అందుకున్నాడు. లాక్‌డౌన్‌తో దిక్కుతోచని స్థితిలో ఉన్న వేలాదిమందిని సొంత డబ్బులతో వారి స్వస్థలాలకు పంపించాడు. రీల్‌లైఫ్ లో విలన్ గా కనిపించిన సోనూ సూద్ గొప్పమనసుకు అందరూ సెల్యూట్ చేశారు.
తన చిన్ననాటి ఫ్రెండ్ నీతిగోయెల్ తో కలిసి ఘర్ భేజో క్యాంపెయిన్‌ను మొదలు పెట్టి 7.5లక్షలకు పైగా వలస కార్మికులను ఆదుకున్నాడు. వారి రవాణా ఖర్చుతోపాటు ఆహారం, మెడికల్, ఇతర సదుపాయాలను కల్పించాడు. అంతే కాదు వారిని సురక్షితంగా సొంత గూటికి చేర్చాడు.
2020లో కరోనా పరిస్థితుల్లో గొప్ప హృదయంతో స్పందించిన సోనూ సూద్‌ను పర్సన్ ఆఫ్ ది ఇయర్-2020గా నిలిచాడు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో ఈ రియల్ హీరో అందించిన సేవలకు ఆయనను యూఎన్డీపీ(UNDP) స్పెషల్ హ్యుమానిటేరియన్ అవార్డుతో సత్కరించింది.