బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌పై మరో ఫిర్యాదు..

Amir Khan Violating Epidemic Rules : బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌ను మరో వివాదం చుట్టుముట్టింది. అయితే ఈ సారి కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించాడని పిర్యాదు అందింది. ఈసారి అమీర్‌ఖాన్ ఎపిడెమిక్‌ యాక్‌ నిబంధనలు బ్రేక్ చేశారని ఆరోపిస్తూ స్థానిక ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమా షూటింగ్‌ కోసం వచ్చిన నటుడు అమీర్‌ఖాన్‌.. ఎపిడెమిక్‌ చట్టాన్ని ఉల్లంఘించారని ఉత్తరప్రదేశ్‌లోని లోని‌ ఎమ్మెల్యే నందకిషోర్‌ గుర్జార్‌.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆయనపై కేసు నమోదు చేసి […]

బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌పై మరో ఫిర్యాదు..

Updated on: Oct 29, 2020 | 9:41 PM

Amir Khan Violating Epidemic Rules : బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌ను మరో వివాదం చుట్టుముట్టింది. అయితే ఈ సారి కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించాడని పిర్యాదు అందింది. ఈసారి అమీర్‌ఖాన్ ఎపిడెమిక్‌ యాక్‌ నిబంధనలు బ్రేక్ చేశారని ఆరోపిస్తూ స్థానిక ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సినిమా షూటింగ్‌ కోసం వచ్చిన నటుడు అమీర్‌ఖాన్‌.. ఎపిడెమిక్‌ చట్టాన్ని ఉల్లంఘించారని ఉత్తరప్రదేశ్‌లోని లోని‌ ఎమ్మెల్యే నందకిషోర్‌ గుర్జార్‌.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపాలని ఆయన కోరారు.

సినిమా షూటింగ్‌కు వచ్చిన అమీర్‌ఖాన్‌ ముఖానికి మాస్క్‌ ధరించకుండా.. పబ్లిక్‌గా తిరుగుతూ అభిమానులతో ఫొటోలు దిగారని, ఈ సమయంలో కనీస సామాజిక దూరం పాటించకుండా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందేలా ప్రవర్తించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో గుర్జార్‌ పేర్కొన్నారు.

ఘజియాబాద్‌లోని ట్రోనికా నగరంలో సినిమా షూటింగ్ కోసం బుధవారం వచ్చినప్పుడు కొవిడ్‌-19 ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని పోలీసు ఫిర్యాదు చేశారు. అంతకుముందు ఆగస్టు నెలలో టర్కీ ప్రథమ మహిళ ఎమిన్ ఎర్డోగాన్‌ను లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగ్‌ కోసం టర్కీ వెళ్లినప్పుడు కలవడం వివాదస్పదమైంది.