యూపీలో రైలు కిందపడి యువకుడి ఆత్మహత్యాయత్నం.. రెండు ముక్కలైన శరీరం.. 12 గంటలపాటు నరకం

ఒక యువకుడు ఆత్మహత్య చేసుకునేందుకు ట్రైన్ కింద పడటంతో అతని శరీరం రెండు ముక్కలై నాలాలో పడిపోయింది.

యూపీలో రైలు కిందపడి యువకుడి ఆత్మహత్యాయత్నం.. రెండు ముక్కలైన శరీరం.. 12 గంటలపాటు నరకం

Edited By:

Updated on: Jan 10, 2021 | 12:27 PM

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఒక యువకుడు ఆత్మహత్య చేసుకునేందుకు ట్రైన్ కింద పడటంతో అతని శరీరం రెండు ముక్కలై నాలాలో పడిపోయింది. ఆ తరువాత కూడా ఆ యువకుడు ఏదో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. శరీర భాగాలు విడిపడి స్థానికులకు ఎదో చెప్పాలని తపనపడ్డాడు. అతన్ని చూసిన జనం దగ్గరకు వెళ్లేందుకు సైతం వెనుకాడారు. చివరికి కొందరు పోలీసుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. సుమారు 12 గంటలపాటు మృత్యువుతో పోరాడి, చికిత్స పొందుతూనే చివరికి తుది శ్వాస విడిచాడు.

ఈ ఘటన యూపీలోని షాజహాన్‌పూర్ జిల్లాలోని రోజా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హథౌడా బుజుర్గ్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువకుడు హర్షవర్థన్ తల్లి దగ్గర డబ్బులు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరాడు. కొద్దిసేపటి తరువాత అందరూ చూస్తుండగానే.. హర్షవర్థన్ రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతని శరీరం రెండు ముక్కలైంది. హర్షవర్థన్ శరీంలో తెగిపడిన కింది భాగం పట్టాలపై పడిపోగా, పైభాగం అక్కడున్న నాలాలో పడిపోయింది. నాలాలో పడిన హర్షవర్థన్ ఏదో మాట్లాడేందుకు ప్రయత్నించాడు.

అయితే, అక్కడున్నవారిలో కొంతమంది దీనిని ప్రమాదంగా గుర్తించలేదు. పైగా ఆయువకుడు ఏదో మాట్లాడటాన్ని కూడా గమనించారు. అయితే, కొద్దిసేపటి తరువాత అక్కడున్న వారు జరిగిన ఘటనను గ్రహించి, అంబులెన్స్‌ను పిలిపించి, ఆ యువకుని శరీరంలోని రెండు భాగాలను మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడి వైద్యులు వెంటనే బాధితునికి చికిత్స అందించారు. 12 గంటలపాటు మృత్యువుతో పోరాడిన హర్షవర్థన్ చివరికి ప్రాణాలను కోల్పోయాడు. అనంతరం హర్షవర్థన్ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో వారు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ పీఆర్వో పూజా పాండేయ్ మాట్లాడుతూ ఒక యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు ప్రయత్నించాడని, రెండు ముక్కలైన అతని శరీరాన్ని ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలిపారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు.

ఇదీ చదవండి….