ముంబైలోని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇంటికి మంగళవారం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. సబర్బన్ బాంద్రాలోని కంగనా రనౌత్‌కు పాలిహిల్ బిల్డింగ్ ఉంది. పౌరసంఘం పర్మిషన్ లేకుండా ఆ బిల్డింగ్ ను నిర్మించారని అధికారులు నోటీసుల్లో వివరించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల నోటీసులను గేటు బయట అతికించినట్లు ఓ అధికారి తెలిపారు. 24 గంటల్లోగా కంగనా స్పందించి.. బీఎంసీకి, పౌర సంస్థకు తగిన వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.
కంగనా ఆఫీసుకూ నోటీసులు..!
ముంబైలోని తన ఆఫీసును బీఎంసీ అధికారులు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆరోపించింది. తన ఇంటిప్రక్కలవారిని కూడా వేధిస్తున్నట్లు పేర్కొంది. మంగళవారం ఆ భవనాన్ని కూల్చివేస్తున్నట్లు తనకు సమాచారం ఇచ్చినట్లు ట్విట్టర్లో పేర్కొంది కంగన.
Also Read :